తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. సచివాలయ భవనాల కూల్చివేతపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సెక్రటేరియెట్ భవనాలను కూల్చకూడదని స్పష్టం చేసింది. దసరా సెలవుల తర్వాత దీనిపై విచారణ జరుపుతామని వెల్లడించింది. తదుపరి విచారణ అక్టోబరు 14కు వాయిదా వేసింది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో పాత ప్రభుత్వ భవనాల కూల్చివేతపైనా చర్చ జరిగినట్లు సమాచారం. ఆ సమయంలోనే సచివాలయ భవనాల కూల్చివేతపై స్టే విధించింది హైకోర్టు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.