హోమ్ /వార్తలు /తెలంగాణ /

Flash News: కామారెడ్డి రైతులకు షాక్..మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

Flash News: కామారెడ్డి రైతులకు షాక్..మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రగడ ఇంకా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇటీవల రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో నేడు రైతుల పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇక మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు తీసుకుంటామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • hyderabad, India

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రగడ ఇంకా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇటీవల రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో నేడు రైతుల పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇక మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు తీసుకుంటామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. ఈ క్రమంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Rythu Bandhu: '5 ఎకరాల వరకే రైతుబంధు పథకం'..కేసీఆర్ కు లేఖ రాసిన AEO

కామారెడ్డి ట్రైనింగ్ ప్లాన్ లో ఇప్పటికిప్పుడు ఏమి కాదు. హైదరాబాద్ , వరంగల్ వంటి మహా నగరాల్లో మాస్టర్ ప్లాన్ పై ఏళ్ల తరబడి ఊగిసలాట కొనసాగిందని కోర్టు పేర్కొంది. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేదని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా మాస్టర్ ప్లాన్ పై కామారెడ్డి మండలం రామేశ్వర పల్లికి చెందిన 40 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు విచారణ అనంతరం ఈ వ్యాఖ్యలు చేసింది.

తెలంగాణకు కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ రాక..సీనియర్లు సహకరించేనా? ఆ సమస్యలు కొలిక్కి వచ్చేనా?

మరోవైపు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలో భాగంగా రైతు జేఏసీ సభ్యులు వినతిపత్రాలు అందించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. ఇండస్ట్రీయల్ జోన్ ను ప్రభుత్వ భూముల్లోకి మార్చాలి. రైతుల భూముల్లో ఇండస్ట్రీయల్ జోన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని రైతులు చేబుతున్నారు.

కలెక్టర్ వివరణ..

మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనపై కామారెడ్డి కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే. ఎవరి భూములను తీసుకోవడం లేదు. అందరి అభిప్రాయాలను తీసుకుంటాం. ఇంకా 60 రోజులు పూర్తి కాలేదు. జనవరి 11 వరకు అభ్యంతరాలు తీసుకుంటాం. కొత్త మాస్టర్ ప్లాన్ పై ఇప్పటికి వెయ్యి అభ్యంతరాలు వచ్చాయి.  మార్పులు, చేర్పులు చేయడానికే ఈ డ్రాఫ్ట్. అభ్యంతరాలను బట్టి ఇండస్ట్రియల్ జోన్ మార్పు రద్దుకు అవకాశం ఉన్నట్టు కలెక్టర్ తెలిపారు.

కామారెడ్డి ఎమ్మెల్యే స్పష్టత..

మాస్టర్ ప్లాన్ పై కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పష్టతనిచ్చారు. ఇండస్ట్రీయల్ జోన్ ను ప్రభుత్వ భూముల్లోకి మారుస్తాం. గ్రీన్ జోన్ కూడా ప్రభుత్వ భూములకు మారుస్తాం. ఇండస్ట్రీయల్ జోన్ నుంచి రైతుల భూములను తొలగిస్తాం. ఇది డీటీసీపీ, కన్సల్టెన్సీ అధికారుల  తప్పిదమే. కౌన్సిల్ సమావేశం తర్వాత ఫైనల్ చేస్తాం. రైతుల భూమి గుంట కూడా పోదని ఎమ్మెల్యే హామీనిచ్చారు. ఎమ్మెల్యే, కలెక్టర్ వివరణ ఇచ్చినా కూడా రైతులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

First published:

Tags: Kamareddy, Telangana, Telangana High Court

ఉత్తమ కథలు