HIGH COURT SERIOUS ON TELANGANA POLICE OF MARIYAMMA LOCK UP DEATH VRY
Lock up death : మరియమ్మ లాకప్‌డెత్..పోలీసుల మెడకు చుట్టుకోనుందా...? జ్యుడిషియల్ విచారణలో ఏం తేలనుంది..?
Lock up death : మరియమ్మ లాకప్‌డెత్..పోలీసుల మెడకు చుట్టుకోనుందా...? జ్యుడిషియల్ విచారణలో ఏం
తేలనుంది..?
Lock up death : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన దళిత మహిళ మరియమ్మ మృతి పోలీసుల మెడకు చుట్టుకోనుందా.. నిబంధనలకు విరుద్దంగా పోలీసులు వ్యవహరించారా.. పోలీసులు ఏ తప్పు చేయకపోతే పోస్ట్‌మార్టం విషయంలో ఎందుకు నిబంధనలకు విరుద్దంగా వ్వవహరించారు..?
ఖమ్మం జిల్లాకు చెందిన మరియమ్మ మరణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసింది..మరియమ్మ మరణంపై ప్రతిపక్షాలు అందోళన నిర్వహించడంతో పాటు దళిత సంఘాలు సైతం నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో మరియమ్మ మరణం రాష్ట్ర పోలీసులకు మరో మచ్చగా మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా మరియమ్మ మృతి తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరును హైకోర్టు తప్పుబట్టింది. పోలీసుల కస్టడీలో ఎవరైనా చనిపోతే..చట్టప్రకారం స్థానిక న్యాయమూర్తిచే విచారణ జరిపించాలనే నిబంధన ఉందని ,పోలీసులు మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు అనుగుణంగానే.. జరిగిన సంఘటన స్థానిక ఆలేరు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ విచారణ జరపాలని ఆదేశించింది. నివేదికను నెల రోజుల్లోపు ఇవ్వాలని పేర్కోంది.మరోవైపు అవసరమైతే రీ పోస్టు మార్టం చేసేందుకు అనుమతి కూడా ఇవ్వాలని మెజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారి చేసింది.
మరియమ్మ మృతి తర్వాత జాతియ మానవ హక్కుల కమీషన్ చట్టం మేరకు స్థానిక ఆర్డీఓ చేత పోలీసులు విచారణ జరిపించి ఆమె మృతదేహాన్ని బంధువులకు అప్పగించడంతో ఖననం కూడా చేశారు. అయితే సీఆర్పీసి ప్రకరాం పోలీసు కస్టడిలో ఉన్న వ్యక్తులు ఎవరైనా చనిపోతే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్‌తో విచారణ జరిపించాల్సి ఉంటుంది.దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి..జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది.
మరోవైపు మరియమ్మ మృతిపై జాతియ మానవహక్కుల కమీషన్ కూడా రంగంలోకి దిగింది. ఆమె మృతిపై సమగ్ర నివేదిక పంపించాలని రాచకొండ పోలీసు కమీషనర్‌కు నోటిసులు పంపింది. దీంతో మరియమ్మ కేసు ఓ వైపు న్యాయపరంగా మరోవైపు మానవ హక్కుల ఉల్లంఘనతోపాటు దళిత సంఘాలు ,రాజకీయ పార్టీలు ఆందోళకు దిగడంతో వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక మరియమ్మ మృతి చెందిన స్థానిక పోలీసు స్టేషన్లో సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. ఇక దీనిపై కూడా రాష్ట్ర హైకోర్టు సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రిం కోర్టు గైడ్‌లైన్స్ ఉన్నా..రాష్ట్ర ప్రభుత్వం పలు పోలీసు స్టేషన్లలో మాత్రం సీసీ కెమెరాలు అమర్చలేదు. దీంతో స్టేషన్లో ఏం జరిగినా అడిగే నాధుడే ఉండడనే ఆలోచనలోకి పోలీసులు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అధికారం ఉందని..స్టేషన్లో కొంతమంది తమ ఇష్టానుసారంగా వ్యవహరించే పరిస్థితి కూడా ఉత్పన్నం కానుంది.
మొత్తం మీద జ్యుడిషియల్ విచారణలో పూర్తి వివరాలు తేలనున్నాయి. నిజంగా మరియమ్మ ఆనారోగ్యంతో చనిపోయిందా..లేదంటే పోలీసుల దెబ్బలకు, అవమానాలకు చనిపోయిందా అనేది తేలనుంది.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.