హోమ్ /వార్తలు /తెలంగాణ /

Saidabad rape : సైదాబాద్ నిందితుడు రాజు మృతిపై న్యాయ విచారణ.. ఆత్మహత్యేనని చెప్పిన డీజీపీ

Saidabad rape : సైదాబాద్ నిందితుడు రాజు మృతిపై న్యాయ విచారణ.. ఆత్మహత్యేనని చెప్పిన డీజీపీ

TS High court

TS High court

Saidabad rape : సైదాబాద్ అత్యాచార నిందితుడి మృతిపై హైకోర్టు న్యాయవిచారణ చేపట్టింది. పౌరహక్కుల నేత వేసిన పిటిషన్ స్వీకరించిన కోర్టు జ్యూడిషియల్ విచారణకు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా సంఘటనపై నివేదిక సమర్పించాలాని వరంగల్ జిల్లా మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది.

ఇంకా చదవండి ...

  సైదాబాద్ అత్యాచార(Saidabad rape) నిందితుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పౌరహక్కుల సంఘం నేత ప్రోఫెసర్ లక్ష్మణ్ (laxman)వేసిన పిటిషన్‌ హైకోర్టు (high court)స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే రాజు(raju) మృతిపై నాలుగు వారాల్లో సీల్డు కవర్‌లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కాగా పోలీసులు రాజును హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ వాదించారు. ఈ సంధర్బంగా ప్రభుత్వం తరఫున కోర్టుకు హజరైన అడ్వకేజ్ జనరల్ రాజును హత్య చేయలేదని ఆత్మహత్య చేసుకున్నాడని ఇందుకోసం ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియతో పాటు పోస్టు మార్టం జరిగేడేప్పుడు వీడియో చిత్రీకరణ కూడా జరిగిందని చెప్పారు. దీంతో పోస్టు మార్టం వీడియోలు వరంగల్ జిల్లా జడ్జికి అప్పగించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

  సైదాబాద్ నిందితుడు రాజు మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.. రాజు ఆత్మహత్యపై అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మూడు రోజుల ముందే రాజును పట్టుకుని చంపేసి.. రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.

  ఇది చదవండి : మాకు అధికారం ఖాయం.. విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం


  మరోవైపు డీజీపీ మహెందర్ రెడ్డి(dgp mahender reddy) రాజు ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు. ఇందుకోసం ఏడుగురు సాక్ష్యులు కూడా ఉన్నారని తెలిపారు. అందులో ఇద్దరు రైల్వే ఉద్యోగులు కూడా ఉన్నారని మిగతావారు స్థానికంగా రైతులతో పాటు ఇతర ప్రజలు కూడా ఉన్నారని స్పష్టం చేశారు. దీంతో రాజు మృతిపై ఎలాంటీ అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు.

  ఇది చదవండి : దళిత బంధు అకౌంట్‌లో డబ్బులు మాయం..? ఏం జరుగుతుందో తెలియక అయోమయం..?


  అయితే అత్యాచారం జరిగిన తర్వాత ఏడు రోజుల పాటు ఎక్కడ ఉన్నాడు. స్టేషన్ ఘన్‌పూర్(ghanpur) ప్రాంతానికి ఎలా వెళ్లాడు అనే ప్రశ్నలతో పాటు అంతమందిని తప్పించుకుని ఆత్మహత్య చేసుకోవడం వెనుక అనుమానాలు వ్యక్తం చేశారు. రాజు తల్లితండ్రులను ఆత్మహత్యకు ఒక రోజు ముందు వరకు పోలీసు స్టేషన్‌లో(police station) ఉంచి ఆ తర్వాత ఒకరోజు ముందు వదిలి పెట్టారని, కోడలుతో పాటు పిల్లలను మంచి చూసుకోమని పోలీసులు చెప్పినట్టు రాజు తల్లి మీడియాకు తెలిపింది.

  ఇది చదవండి :  మరో మహిళా అధికారిపై పెట్రోల్ దాడి... కారణం ఇదే.. !

  Published by:yveerash yveerash
  First published:

  ఉత్తమ కథలు