హోమ్ /వార్తలు /తెలంగాణ /

Naredmet Division: హైదరాబాద్ నేరేడ్‌మెట్ కార్పొరేటర్ ఎన్నికపై హైకోర్టు తీర్పు

Naredmet Division: హైదరాబాద్ నేరేడ్‌మెట్ కార్పొరేటర్ ఎన్నికపై హైకోర్టు తీర్పు

GHMC Elections Results: జీహెచ్ఎంసీలో ఓట్ల కౌంటింగ్ (File)

GHMC Elections Results: జీహెచ్ఎంసీలో ఓట్ల కౌంటింగ్ (File)

Hyderabad GHMC Election Results Update: నేరేడ్‌మెట్ డివిజిన్‌లో ఏర్పడిన సందిగ్ధంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. అన్ని ఓట్లను లెక్కించాలని స్పష్టం చేసింది. బ్యాలెట్ మీద స్వస్తిక్ ముద్రతో పాటు ఇతర ముద్ర (పెన్ను టిక్ మార్క్, సున్నా చూట్టడం, టిక్ పెట్టడం) ఉన్న 544 ఓట్లను కూడా లెక్కించాలని హైకోర్టు ఆదేశించింది.

ఇంకా చదవండి ...

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి నేరేడ్‌మెట్ డివిజిన్‌లో ఏర్పడిన సందిగ్ధంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. అన్ని ఓట్లను లెక్కించాలని స్పష్టం చేసింది. బ్యాలెట్ మీద స్వస్తిక్ ముద్రతో పాటు ఇతర ముద్ర (పెన్ను టిక్ మార్క్, సున్నా చూట్టడం, టిక్ పెట్టడం) ఉన్న 544 ఓట్లను కూడా లెక్కించాలని హైకోర్టు ఆదేశించింది. మొత్తం కలిపి రీ కౌంటింగ్ చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో ప్రస్తుతం కౌంటింగ్ కోసం పెండింగ్‌లో ఉన్న ఒక బాక్సును కూడా ఓపెన్ చేసి ఓట్లను లెక్కించనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. డిసెంబర్ 1న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 4న కౌంటింగ్ జరిగింది. ఆ కౌంటింగ్‌కు కొన్ని గంటల ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సర్క్యులర్ జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం బ్యాలెట్ పత్రాల మీద స్వస్తిక్ గుర్తుతో పాటు ఇతరత్రా గుర్తులు పెన్నుతో టిక్ పెట్టి ఉన్నా, చుక్క పెట్టి ఉన్నా కూడా దాన్ని ఓటుగా గుర్తించాలంటూ ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చింది. దీన్ని బీజేపీ తప్పుపడుతూ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సర్క్యులర్‌ను సస్పెండ్ చేసింది. తుది తీర్పునకు లోబడి ఫలితాలు ఉండాలని చెప్పింది. అయితే, ఎన్నికలకు సంబంధించి ఈసీ విధుల్లో కోర్టుల జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ ఎస్ఈసీ మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం స్వస్తిక్ గుర్తులతో పాటు ఇతర గుర్తులు ఉన్నా కూడా వాటిపై రిటర్నింగ్ అధికారి నిర్నయం తీసుకోవాలని స్పష్టం చేసింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది?

టీఆర్ఎస్ 55

బీజేపీ 48

ఎంఐఎం 44

కాంగ్రెస్ 2

2016లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీకి 99 సీట్లు వచ్చాయి. ఇప్పుడు భారీగా సీట్లు కోల్పోయింది. 150 సీట్లలో పోటీ చేస్తే కేవలం 55 సీట్లు వచ్చాయి. ఇక బీజేపీ 2016లో 4 సీట్లు గెలిచింది. ఇప్పుడు 48 సీట్లకు ఎగబాకింది. ఎంఐఎం పార్టీ 2016లో 44 సీట్లు గెలిచింది. ఈసారి కూడా తమ 44 సీట్లను నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా 2016లో 2 సీట్లు గెలిచింది. అదే 2 సీట్లు కాపాడుకుంది.

2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేరేడ్ మెట్ డివిజన్ నుంచి ఐదుగురు అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ తరఫున వి.ప్రసన్న నాయుడు, టీఆర్ఎస్ నుంచి కొత్తపల్లి మీనారెడ్డి, కాంగ్రెస్ నుంచి మరియమ్మ, టీడీపీ తరఫున తమిళ్ మనవి, స్వతంత్ర అభ్యర్థిగా నాగేశ్వరి పోటీ చేశారు. జీహెచ్ఎంసీలో నేరేడ్ మెట్ 136 నెంబర్ డివిజన్. ఇక్కడ మొత్తం 56092 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 28135, మహిళలు 27,955, ఇద్దరు ట్రాన్స్ జెండర్ ఉన్నారు. మొత్తం 63 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. 2016లో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కటికనేని శ్రీదేవి కార్పొరేటర్‌గా గెలిచారు. ఈసారి సిట్టింగ్ కార్పొరేటర్‌కు చాన్స్ ఇవ్వకుండా కొత్త అభ్యర్థి కొత్తపల్లి మీనారెడ్డిని బరిలోకి దింపింది టీఆర్ఎస్.

First published:

Tags: GHMC Election Result, Hyderabad - GHMC Elections 2020, Telangana High Court

ఉత్తమ కథలు