లాక్‌డౌన్‌లో విద్యుత్ బిల్లుల మాఫీ.. హైకోర్టు నోటీసులు..

తెలంగాణ హైకోర్టు

లాక్‌డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని హైకోర్టులో పిల్ దాఖలయ్యింది. న్యాయవాది నరేశ్, సమీర్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది.

  • Share this:
    లాక్‌డౌన్ కాలంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయనే ఆరోపణలు జోరుగా విన్పించాయి. మూడు నెలల కాలానికి సంబంధించి విద్యుత్ బిల్లులను ఒకేసారి తీయడంతో స్లాబులు మారి అధికంగా విద్యుత్ బిల్లులు వచ్చాయనే ప్రచారం జరిగింది. అయితే తెలంగాణలో అసలే లాక్‌డౌన్ కాలంలో పనులు లేక.. ఆదాయం రాక ప్రజలు అల్లాడిపోయారు. అలాంటి సమయంలో ఆదుకోవాల్సిన విద్యుత్ బిల్లుల రూపంలో ప్రజలపై భారం మోపడం పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని హైకోర్టులో పిల్ దాఖలయ్యింది. న్యాయవాది నరేశ్, సమీర్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఎస్పీడీసీఎల్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

    విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చాయని హైకోర్టులో మరో పిల్ దాఖలైంది. స్లాబులు సవరించి బిల్లులు తగ్గించాలనే వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ చేపట్టారు. విద్యుత్ బిల్లులపై ఫిర్యాదులు ఉంటే కమిటీని ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది. ఫిర్యాదుల పరిష్కారానికి కమిటీ ఉండగా తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. కమిటీకి 6,767 ఫిర్యాదులు రాగా ఇప్పటివరకు 6,678 పరిష్కరించినట్టు ఏజీ ప్రసాద్ తెలిపారు.
    First published: