ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు (High Court) తిరిగి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో సిట్ అధికారులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారే చేసింది. BL సంతోష్ కు ఈ మెయిల్ ద్వారా 41ఏ CRPC నోటీసులు మళ్లీ ఇవ్వాలని ఆదేశించింది. ఈరోజు ఉదయం ఈ కేసుపై విచారించిన కోరు సుప్రీంకోర్టు ఉత్తర్వులు అందని కారణంగా మధ్యాహ్నానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సుప్రీంకోర్టు తీర్పు కాపీ హైకోర్టు బెంచ్ ముందుకు రావడంతో కీలక ఆదేశాలు జారీ చేసింది.
కొత్త నోటీసులు అలా ఇవ్వండి..
ఈ కేసుకు సంబంధించి BL సంతోష్ కు మరోసారి కొత్తగా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు (High Court) పేర్కొంది. BL సంతోష్ గుజరాత్ ప్రచారంలో ఉన్నారని ఎన్నికల తరువాతే నోటీసులు ఇవ్వాలని బీజేపీ తెలపడంతో ఈ మెయిల్ ద్వారా కొత్త నోటీసులు పంపించాలని హైకోర్టు (High Court) ఆదేశించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
30కు విచారణ వాయిదా..
ఇక ఈ కేసును 30వ తేదికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు (High Court) తెలిపింది. అయితే BL సంతోష్ పలానా రోజు విచారణకు హాజరు కావాలని కోర్టు తెలపలేదు. నోటీసులు ఇచ్చిన తరువాత వారు ఎప్పుడు విచారణకు వస్తారో చెప్పాల్సి ఉంటుంది. మరి గుజరాత్ ఎన్నికలు అయిపోయాకే సంతోష్ విచారణకు హాజరు అవుతారా లేక 30వ తేదీన హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.
సిట్ సరైందేనా..సిబిఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం అవసరమా?
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి హైదరాబాద్ సీపీ ఆనంద్ తో సహా పలువురితో కలిపి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసులో సిట్ ఏర్పాటు చేయడం సరైందేనా. లేక హైకోర్టు ప్రత్యేక బృందాన్ని నియమిస్తుందా లేక సీబీఐకి కేసు అప్పగిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేడు జరిగిన విచారణ అంతా సంతోష్ చుట్టూనే తిరుగుతుంది. నేటి విచారణకు BL సంతోష్ కానీ అతని న్యాయవాది గాని రాలేదు. అయితే ఎలాగైనా సంతోష్ ను విచారణకు రప్పించాలని సిట్ ప్రయత్నాలు చేస్తుంది. అయితే దీనిపై ఈనెల 30వ తేదీన హైకోర్టు (High Court) ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Highcourt, Hyderabad, Telangana, TRS MLAs Poaching Case