Home /News /telangana /

HIGH COURT ANGRY ON UNION HOME MINISTRY REGARDING TRS MLA CHENNAMANENI RAMESH CITIZENSHIP CASE AK

Chennamaneni Ramesh: ఆ మాత్రం దానికి మీ హోదాలు ఎందుకు ?.. కేంద్ర హోంశాఖపై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ హైకోర్టు(ఫైల్ ఫోటో)

తెలంగాణ హైకోర్టు(ఫైల్ ఫోటో)

Chennamaneni Ramesh: జర్మనీ ఎంబసీ నుంచి వివరాలు రాబట్టలేకపోతే ఎందుకు మీ హోదాలు ఎందుకని కేంద్ర హోంశాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

    వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై విచారణ జరుపుతున్న తెలంగాణ హైకోర్టు.. కేంద్ర హోంశాఖపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేయకుండా మెమో దాఖలు చేయడాన్ని తప్పుబట్టింది. అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. జర్మనీ ఎంబసీ నుంచి వివరాలు రాబట్టలేకపోతే ఎందుకు మీ హోదాలు ఎందుకని కేంద్ర హోంశాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ పాత మెమోలు సమర్పించడం ఎందుకని వ్యాఖ్యానిచింది. జర్మనీ ఎంబసీ నుంచి పూర్తి సమాచారంతో అఫిడవిట్ వేయాలని హోంశాఖను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది.

    వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ పౌరసత్వంపై ఎంతో కాలంగా వివాదం నడుస్తోంది. గతంలోనే కేంద్ర హోంశాఖ ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. జర్మనీ పాస్ పోర్టు కలిగి ఉన్న చెన్నమనేని రమేష్ మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని కేంద్ర హోంశాఖ తేల్చింది. 1955 సిటిజన్ యాక్ట్ ప్రకారం భారత పౌరసత్వానికి అనర్హుడని ప్రకటించింది. చెన్నమనేని రమేష్ వేములవాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడుసార్లు ఆయన ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. చెన్నమనేని రమేష్ 1990లో ఉద్యోగం కోసం జర్మనీ వెళ్లారు. 1993లో ఆయన జర్మనీ సిటిజన్ షిప్ పొందారు. దీంతో ఆయన ఇండియన్ పాస్ పోర్టును సరెండర్ చేశారు. 2008లో భారత్‌కు తిరిగివచ్చిన ఆయన ఇండియన్ సిటిజన్ షిప్ కోసం మళ్లీ దరఖాస్తు చేయగా… హోంశాఖ మంజూరు చేసింది. 2009లో వేములవాడ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా చెన్నమనేని రమేశ్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తరువాత ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గెలిచారు. 2014, 2018లోనూ టీఆర్ఎస్ తరపున వరుసగా గెలిచారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Telangana, Telangana High Court, Trs

    తదుపరి వార్తలు