రెండు రోజుల క్రితం జైలుకు వెళ్లిన బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వెంటనే ఆయన విడుదల చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేరింది. 40 వేల రూపాయల పూచికత్తుతో బెయిలు మంజూరు చేసింది.
కాగా నిన్న హైకోర్టులో తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ,వాటిని వెంటనే రద్దు చేయాలని ఆయన లంచ్ మోషన్ పిటిషన్‌పై వేశారు.. విచారణ చేపట్టిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్.. ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించిన కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదని పిటిషన్‌ను తిరస్కరించింది. ఎమ్మెల్యే, ఎంపీల కేసులు విచారణ జరిపే సంబంధిత కోర్టుకు వెళ్ళాలని బండి సంజయ్ తరపు న్యాయవాదికి సూచించింది. ఈ పిటిషన్‌ను సంబంధిత బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. దీంతో నేడు మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం, సంజయ్ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది
కరీంనగర్ లో జాగరణ దీక్ష సందర్భంగా బండి సంజయ్ తో సహా 16 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు బండి సంజయ్‌తో పాటు మరో ఐదుగురిని మాత్రమే కోర్టులో హాజరుపరిచారు . మిగతా వారు పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు ..
ఆదివారం రాత్రి కోవిడ్ ఆంక్షలకు విరుద్ధంగా జాగరణ దీక్ష చేపట్టడంతో పాటు పోలీస్ విధులను అడ్డుకోవడంతో బండి సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే..
కాగా బండి సంజయ్ అరెస్ట్ , ఆ తర్వాత పరిణామాలు టెన్షన్‌ను క్రియెట్ చేశాయి..... ఆయన అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా ఉద్రిక్తలు రేకెత్తిస్తున్నాయి.. ఇప్పటికే ఆయన అరెస్ట్‌కు నిరసనగా ఆపార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళలనకు పిలుపునిచ్చింది. మరోవైపు పోలీసు ట్రైనింగ్ సెంటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన నిర్వహించారు. అయితే పోలీసులు కొవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుండడంతో వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు బండి సంజయ్‌తో పాటు 12 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలపై పలు కేసులు నమోదు చేశారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.