• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HIDDEN TREASURE FOUND IN A AGRICULTURE FIELD IN VIKARABAD SK

పొలం తవ్వుతుంటే లంకె బిందెలు ప్రత్యక్షం.. వికారాబాద్ గుప్త నిధులు

పొలం తవ్వుతుంటే లంకె బిందెలు ప్రత్యక్షం.. వికారాబాద్ గుప్త నిధులు

ప్రతీకాత్మక చిత్రం

విషయం ఆ నోటా ఈ నోటా పడి.. చివరకు పోలీసులు, రెవెన్యూ అధికారులకు తెలిసింది. వారు పొలంలోకి వెళ్లి పరిశీలించారు. అనంతరం పొలం యజమాని యాకూబ్‌ను విచారించారు.

  • Share this:
    వికారాబాద్‌ జిల్లాలో గుప్త నిధులు బయటపడ్డాయి. ఓ వ్యవసాయ పొలంలో లంకె బిందెలు లభ్యమయ్యాయి. జిల్లాలోని పెరిగి మండలం ఎర్రగడ్డపల్లికి చెందిన చెందిన రైతు యాకూబ్ అలీ.. తన పొలం తవ్వుతున్న సమయంలో పూర్వకాలం నాటి రాగి పాత్రలు బయటపడ్డాయి. వాటిని బయటకు తీసి చూడగా స్థానికులు లంకె బిందెలుగా గుర్తించారు. ఆ రాగి పాత్రల్లో వెండి, బంగారు ఆభరణాలు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి.. చివరకు పోలీసులు, రెవెన్యూ అధికారులకు తెలిసింది. వారు పొలంలోకి వెళ్లి పరిశీలించారు. అనంతరం పొలం యజమాని యాకూబ్‌ను విచారించారు. ఐతే కొన్ని రాగి పాత్రలు మాత్రమే లభ్యమయ్యాయని.. అందులో ఎలాంటి ఆభరణాలు లేవని ఆయన అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఆ పాత్రలను స్వాధీనం చేసుకొని ఘటపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతంలోనూ వికారాబాద్ జిల్లాలోని పలు చోట్ల గుప్త నిధులు లభ్యమైన విషయం తెలిసిందే.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు