హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kothagudem : పందెం కోళ్ల అరెస్ట్.. నాలుగు రోజులుగా పోలీసుల పహారా..

Kothagudem : పందెం కోళ్ల అరెస్ట్.. నాలుగు రోజులుగా పోలీసుల పహారా..

Kothagudem : పందెం కోళ్ల అరెస్ట్.. నాలుగు రోజులుగా పోలీసుల పహారా..

Kothagudem : పందెం కోళ్ల అరెస్ట్.. నాలుగు రోజులుగా పోలీసుల పహారా..

Kothagudem : పోలీస్ స్టేషన్‌లో పందెం కోళ్లకు పోలీసులు పహరా కాస్తున్నారు.. వాటికి కావాల్సిన తిండి.. నీళ్లు పెట్టి నాలుగు రోజులుగా స్టేషన్‌లో బందీగా ఉంచారు.. ఇంతకి ఆ కోళ్లు చేసిన నేరం ఏమిటంటే.. వాటికి పోలీసులు ఎందుకు కాపలా కాస్తున్నారు.. ?

ఇంకా చదవండి ...

నేరం చేసినప్పుడు దాన్ని నిరూపించి నిందితులకు సరైన శిక్ష పడేలా చేయడం పోలీసుల విధి. అయితే నేరస్థులకు సహకరించిన ఎవరైనా వారిని సాక్షులుగా ప్రకటించి కోర్టు ముందు ఉంచుతారు. అయితే నేరస్థులకు సహకరించిన వారు మనుష్యులైతే వారిని స్టేషన్‌లో పెట్టి ఎక్కడికి పారిపోకుండా పోలీసులు చర్యలు చేపడతారు. అయితే అది నేరానికి సహకరించిన వారు మనుష్యులైన మరే ఇతర జంతువులైన చట్టానికి సమానమే .. అందుకే నేరం చేశారని భావించిన లేదా నేరస్థులకు సహకరించినా జంతువులు, పక్షులను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో అభం శుభం తెలియని పక్షులు జైలు పాలు కాక తప్పడం లేదు. ఇలా తాజాగా నేరం విషయంలో తమకు ప్రమేయం లేకుండానే పందెం కోళ్లు జైలు జీవితం గడుపుతున్నాయి. అక్కడ వాటికి ఫుడ్ పెడుతూ పోలీసులు పహార కాస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం దంతలబోరు శివారు అటవీ ప్రాంతంలో ఈనెల 25న కోడి పందేలు నిర్వహించారు. ఈ కోడి పందేలకు సంబంధించి సమాచారం అందుకున్న పాల్వంచ రూరల్ ఎస్సై సుమన్.. తన సిబ్బందితో కలిసి కోడి పందేలు నిర్వహిస్తున్న ప్రదేశానికి వెళ్లారు. పందెం కోళ్ళ స్థావరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా మూడు పందెం కోళ్లతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. అనంతరం ఆ పందెం రాయుళ్ళకు పోలీసులు నోటీసులు జారీ ఇచ్చి పంపించారు. కానీ పోలీసులు మాత్రం ఆ పందెం కోడిపుంజులను నేటికీ విడుదల చేయలేదు. కిన్నెరసాని రూరల్ పోలీసు స్టేషన్ ప్రాంగణంలోనే కోడి పుంజులను బంధించారు. ఎందుకంటే సరైన సాక్ష్యాలతో కోర్టుల ముందు ఉంచేందుకు వాటిని స్టేషన్‌లోనే ఉంచారు. పుంజుల రంగుల ఆధారంగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని, తదుపరి కోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా పందెం కోళ్లను ఉపయోగించి చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన వారికి నోటిసులు ఇచ్చి బయట ఉంచి.. నోరు లేని కోళ్లను మాత్రం అరెస్ట్ చేసి లోపల వేయడం విడ్డూరంగానే ఉంది.

ఇది చదవండి : ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం.. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలింపు..


ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం ఓ చిలుకను పాకిస్తాన్ బోర్డర్‌నుండి వచ్చిందని స్థానిక పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆ చిలక కాలికి ఏదో కాగితం కట్టి ఉండడం దాన్ని రహస్యలు చేధించేందుకు శత్రుదేశం పంపించినట్టుగా భావించి దాన్ని బోనులో పెట్టారు. కాగా అక్కడడక్కడ తెలంగాణలో కూడా హరిత హారం చెట్లను తిన్న మేకలు, ఇతర పశువులను కూడా పోలీస్ స్టేషన్‌లకు తరలించిన సంఘటనలు కూడా వెలుగు చూశాయి. మొత్తం మీద చట్టం ముందు అందరు సమానమే అనే నిబంధన పశువులు, జంతువులకు కూడ వర్తిస్తుందనేది గుర్తుంచుకోవాల్సిన అంశం.

First published:

Tags: Bhadradri kothagudem, Telangana Police

ఉత్తమ కథలు