Home /News /telangana /

HELPING HANDS SOME FACEBOOK FRIENDS DOING ONE POOR GIRL MARRIAGE IN TELANGANA NGS

Facebook Marriage: పేదింటి అమ్మాయికి పెళ్లి చేసిన ఫేస్ బుక్ ఫ్రెండ్స్.. ఎలా చేశారో తెలుసా..?

పేదింటి అమ్మాయికి పెళ్లి చేసిన ఫేస్ బుక్ ఫ్రెండ్స్

పేదింటి అమ్మాయికి పెళ్లి చేసిన ఫేస్ బుక్ ఫ్రెండ్స్

కూతురుకి మంచి సంబంధం వచ్చినా.. పెళ్లి చేసే స్తోమత లేక ఓ తండ్రి పెళ్లిని రద్దు చేయాలి అనుకున్నాడు. కానీ విషయం తెలుసుకున్న ఫేస్ బుక్ ఫ్రెండ్స్.. చేయి చేయి కలిపి.. ఆగిపోతుంది అనుకున్న ఆ అమ్మాయి పెళ్లి చాలా ఘనంగా చేశారు..? అసలు ఏం జరిగిందంటే..?

ఇంకా చదవండి ...
    Facebook Marriage: ఈ రోజుల్లో సోషల్ మీడియా (social media) అంటే మంచి కంటే చెడే ఎక్కువ చేస్తోందనే అభిప్రాయం చాలా గట్టిగా పాతుకుపోయింది. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న నేరాలు అన్నింటిలో ఎక్కువ శాతం సోషల్ మీడియా కారణంగానే జరుగుతున్నాయి. పో్లీసులు సైతం పదే పదే హెచ్చరిస్తున్నారు.. నిపుణులు అదే సూచిస్తున్నారు. సోషల్ మీడియా విషయంలో జాగ్రత్త అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. అన్ని విషయాల్లోనూ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో దుర్వినియోగం అవుతోంది అన్నది అందరూ అంగీకరించాల్సిన సత్యం. అయితే ఒకవైపే కాదు మరో వైపు చూస్తే సోషల్ మీడియా ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొందరు మాత్రం స్వార్థానికి వాడుకోవడంతో నేరాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఫేస్ బుక్ (facebook) ద్వారా పరిచయమైన కొందరు స్నేహితులు చేసిన పని సెల్యూట్ చేసేలా చేస్తోంది. వారంతా ఒకరికి ఒకరు ఏమీ కాకపోయినా.. వారిది జస్ట్ ఫేస్ బుక్ పరిచయమే అయినా.. ఓ పేదింటి అమ్మాయికి పెళ్లి చేశారు. ఓ పేది ఇంటి అమ్మాయికి పెళ్లి ఆగిపోతోందని అని తెలియగానే స్పందించిన వారంతా.. పెళ్లి జరిపేందుకు ముందుకు వచ్చారు.. ఎలా జరపాలి అని ప్లాన్ చేసుకుని.. ఆగిపోవాల్సిన పెళ్లిని.. ముందుండి జరిపించారు. ప్రస్తుతం ఈ వివాహమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సింగారపు లక్ష్మణ్ –లక్ష్మీ అనే నిరుపేద దంపతులకు రజిత అనే కూతురు ఉంది. ఇటీవలే రజితకు వివాహం కుదిరింది. అయితే పెళ్లి జరపాలంటే ఈ రోజుల్లో చాలానే ఖర్చు అవుతుంది. కానీ కనీస ఖర్చు కూడా పెట్టలేని పరిస్థితి ఆ తల్లిదండ్రులది.. ఆర్థిక స్థోమత లేక కూతురు వివాహం ఎలా జరిపించాలో తెలియక.. ఇక వివాహం ఆపేద్దామనుకున్నారు. అయితే స్థానిక వార్డు సభ్యుడు చెప్యాల గణేష్ అనే వ్యక్తి విషయం తెలుసుకుని.. రజిత తల్లిదండ్రులతో మాట్లాడారు. దీంతో రజిత తల్లిదండ్రులు వివాహం, ఆర్థిక పరిస్థితి గురించి వివరించారు.

    వారి ఆర్థిక స్థోమత తెలుసుకున్న గణేష్ సామాజిక సేవలు చేస్తున్న ‘నా కలం అక్షర సత్యం’ ఫేస్ బుక్ పేజీ అడ్మిన్ కు తెలియజేశారు. అడ్మిన్ వెంటనే స్పందించారు. అమ్మాయి దీనగాధ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసి, అలాగే తన టీమ్ సభ్యులు అమ్మాయి వివాహ ఖర్చులకు కోసం సోషల్ మీడియా వేదికగా కాంపెనింగ్ మొదలు పెట్టారు. దీంతో.. దాతలు ముందుకు వచ్చి రజిత వివాహానికి అండగా నిలిచారు. తోచిన వారికి తోచిన విధంగా సహాయం అందించారు. పుస్తే, మట్టెతో పాటు ఇతర పెళ్లి సామాగ్రి అందించారు. కొత్త సంసారానికి కావాల్సిన వస్తువులన్నీ కొనుగోలు చేసి ఇచ్చారు. తోడబుట్టిన అన్నల మాదిరిగా అన్ని వస్తువులు ఇచ్చి రజిత వివాహం ఘనంగా జరిపించారు. అనంతరం వధువు ఇంటిలో విందు ఏర్పాటు చేశారు.http://

    నా కలం అక్షర సత్యం టీమ్ సభ్యుల అభ్యర్థన మేరకు స్థానిక సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్ పెళ్ళి భోజనాల ఖర్చు, చెలుకల తిరుపతి టెంటు, వంట సామాగ్రి, రుద్రంగి బ్లడ్ డోనర్ వ్యవస్థాపకుడు మరిపెల్లి విశాల్ రిసెప్సన్ స్టేజి ఇలా తలా ఓ చెయి వేసి రజిత వివాహాం ఘనంగా జరిపించారు. దాతలు పంపిన విరాళాలు పెండ్లి ఖర్చుల పోను మిగితా రూ. 1 లక్షా 71 వేలు రజిత తల్లిదండ్రులు సింగారపు లక్ష్మణ్, లక్ష్మీ దంపతులకు వివాహం తరువాత అందజేశారు.http://

    వివాహానికి అన్ని తామై చూసుకున్న ‘నా కలం అక్షర సత్యం’ ఫేస్ బుక్ అడ్మిన్, టీం సభ్యలను గ్రామస్థులు, సోషల్ మీడియా వేదికగా ప్రశంల జల్లు కురిపిస్తున్నారు. మొత్తానికి.. సోషల్ మీడియా స్నేహితులు.. ఓ పేద అమ్మాయి పెళ్లి కి సహాయం అందించారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Facebook, Facebook friend, Social Media, Telangana, Vemulawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు