huzurabad : జంపింగ్‌లకు పదిరోజుల్లోనే ఎమ్మెల్సీ...మరి పార్టీలో పాతుకుపోయిన వారిని ఏం చేస్తారో..

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

huzurabad : ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన నేతలకు పదిరోజుల్లోనే అందలం ఎక్కించడంతో టీఆర్ఎస్‌ నేతల్లో అంతర్మథనం మొదలైందా....సంవత్సరాల తరబడి పార్టీలో పాతుకుపోయిన వారికి సీఎం కేసీఆర్ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు..ఇప్పుడు ఇదే టాపిక్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ క్యాడర్‌లో కొనసాగుతోంది..

 • Share this:
  దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత తేరుకున్న గులాబి బాస్ ..ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఈనేపథ్యంలోనే నాగార్జున సాగర్ నుండి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుని పార్టీని విజయఫథంవైపు నడిపిస్తున్నారు...

  అయితే హుజూరాబాద్ ఎన్నికల్లో ఆయన తీరు పూర్తిగా మారిపోయింది..పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.. కేవలం ఉప ఎన్నికల్లో విజయం కోసమేనంటూ అనేక అభివృధ్ది కార్యక్రమాలతోపాటు పార్టీ పదవుల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు..ఈ క్రమంలోనే ఎవరెన్ని చెప్పినా ఎన్నికల కోసమే దళిత బంధు అంటూ బల్లగుద్ది చెప్పడంతో పాటు , కేవలం పదిరోజుల్లోనే పార్టీ మారిన ప్రత్యర్ధి నేతలను సైతం అందలం ఎక్కించారు..ఎంతో మంది సీనియర్లను కాదని పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు.

  ఈ కీలక పరిణామంతో హుజూరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పార్టీ క్యాడర్‌కు గెలుపే లక్ష్యమనే సంకేతాలు ఇచ్చారు..మనుష్యులు కాదు పార్టీనే ముఖ్యమని చెప్పకనే చెప్పారు..ఎంతటి సీనియర్లైన తన విధేయతకు కట్టుబడి ఉండాలనే అంశాన్ని జోడించారు. అయితే తాజాగా సీఎం తీసుకున్న నిర్ణయంపై పార్టీలో అంతర్గత చర్చ కొనసాగుతున్నట్టు సమాచారం.ఇలాంటీ నిర్ణయాలతో పాత క్యాడర్ ఎలా ముందుకు సాగుతుందనే మీమాంస కూడా కార్యకర్తల్లో ఉన్నట్టు తెలుస్తోంది..

  ఇక పాత క్యాడర్‌ను పక్కన పెడితే హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇటివల పార్టీ చేరికలతో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి..సీఎం కేసీఆర్ ప్రొద్భలంలో అనేక మంది ఇతర పార్టీ నేతలు పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు వీరికి ఎలాంటీ పదవులు ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి కంటే సీనియర్లైన రమణ లాంటీ నేతలు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు..దీంతో తమ భవితవ్వంపై సందేహంలో ఉన్నారు. అయితే వారికి ఏ హామీలు ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారనేది తేలాల్సిన అంశం. ఇప్పటికే హుజూరాబాద్‌కు ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ ‌తోపాటు ఓ ఎమ్మెల్సీ కూడా వచ్చింది..ఇక మిగిలింది ఇటివల పార్టీలో చేరిన ఎల్ రమణ, పెద్దిరెడ్డిలతొ పాటు స్వర్గం రవిలు మిగిలి ఉన్నారు..మరోవైపు పార్టీకి ఎన్నో రోజుల నుండి పని చేస్తూ బీసీ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్, వకుళాభరణం క‌ృష్ణమోహన్‌లు కూడా ఎమ్మెల్యే సీటును ఆశిస్తున్నారు..

  అయితే మొత్తం మీద రెడ్డి సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఉన్నత వర్గాలకు ఇక ఎమ్మెల్యే సీటును కేటాయించరనే స్పష్టమైన సంకేతాలను సీఎం కేసీఆర్ ఇచ్చారు.మరోవైపు నియోజకవర్గంలో అధిక శాతంగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి ఆర్ధిక చేయూతనిచ్చేందుకు దళిత బంధు ప్రకటించారు.ఇక మిగిలింది బీసీ సామాజిక వర్గాలే..అయితే ఈ వర్గాల్లో పాతవారికి అవకాశం దక్కుతుందా..లేక..ఇటివల పార్టీలో చేరిన కొత్త వారికి ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందా అనేది తేలాల్సిన అంశం.. ఏదైనా ఈ నెల ఆఖరులోపు అభ్యర్థి ఎన్నికకు ఫుల్‌స్టాప్ పడనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
  Published by:yveerash yveerash
  First published: