Home /News /telangana /

HEAVY TRAFFIC JAM IN AP AND TELANGANA BORDER POLICE IMPLEMENT STRICT LOCKDOWN RULES SU

ఏపీ-తెలంగాణ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్.. ఈ పాస్‌ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ-ఆంధ్రా సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు నిబంధనలు కఠినతరం చేశారు.

    తెలంగాణ-ఆంధ్రా సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు నిబంధనలు కఠినతరం చేశారు. ఈ పాస్ ఉన్నవారినే తెలంగాణలో అనుమతిస్తున్నారు. పాసులు లేని వాహనాలను అక్కడే ఆపేస్తున్నారు. దీంతో కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు ఆగిపోయాయి.
    అయితే అంబులెన్స్‌లకు మాత్రం పోలీసులు మినహాయింపు ఇచ్చారు. దీంతో ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. వాహనాలను పోలీసులు అనుమతించకపోడంతో.. చాలా మంది వాహనదారులు రోడ్లపైనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సరిహద్దులోని కృష్ణా జిల్లా గరికపాడు వద్ద ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. కరోనా నేపథ్యంలో నేటి నుంచి సూర్యాపేట జిల్లా సరిహద్దుల్లో అంక్షలు అమలు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. మఠంపల్లి, పులిచింతల చెక్‌పోస్టులను మూసివేస్తున్నట్టు చెప్పారు. కోదాడ మీదుగా మాత్రమే వాహనాలను తెలంగాణలోకి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

    లాక్‌డౌన్ మినహాయింపు సమయం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలోనూ అనుమతించకపోవడంపై కొందరు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. నిన్నటి వరకు లేని అంక్షలు ఇప్పడు ఎందుకు ప్రవేశపెట్టారని కొందరు వాహనదారులు మండిపడుతున్నారు. అయితే తెలంగాణ పోలీసులు మాత్రం ఈ పాస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్టు స్పష్టం చేస్తున్నారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌లకు, ఈ-పాస్ ఉన్న వాహ‌నాల‌కు మాత్ర‌మే అనుమతిస్తున్నట్టు చెప్పారు.లాక్‌డౌన్ మినహాయింపు సమయంలో కూడా ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని పోలీసులు

    కొంత మంది వాహనదారులు, ప్రజలు లాక్‌డౌన్ మినహాయింపు సమయాన్ని ఆసరాగా చేసుకుని అనవసరంగా సరిహద్దులు దాటుతున్నార‌ని పోలీసులు చెప్పారు. అలాగే ఆంధ్రా నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఉదయం 4 నుంచి 6 గంటలోపు రామాపురం ఎక్స్‌రోడ్‌ అంతరాష్ట్ర చెక్ పోస్టుకు చేరుకుటున్నార‌ని.. 6 గంటల త‌ర్వాత‌ తెలంగాణలోకి వస్తున్నార‌ని తెలిపారు. ఇలా చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉందన్నారు. అందుకే ఆంక్షలను కఠినతరం చేసినట్టు చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Andhra Pradesh, AP Telangana border, Telangana, Telangana lockdown

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు