హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి మంటలు.. దట్టమైన పొగలు.. ఏం జరిగిందంటే..

Hyderabad: పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి మంటలు.. దట్టమైన పొగలు.. ఏం జరిగిందంటే..

పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద అగ్నిప్రమాదం

పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద అగ్నిప్రమాదం

నగరం నడిబొడ్డున నడి రోడ్డుపై జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఘటనా స్థలానికి కూతవేటు దూరంలోనే సీఎం నివాసం ఉండడంతో పోలీసులు కూడా ఉరుకులు పరుగులు పెట్టారు.

  హైదరాబాద్‌లోని పంజాగుట్టలో అగ్రిప్రమాదం జరిగింది. పంజాగుట్ట ఫ్లైఓవర్లోని ఓ పిల్లర్ నుంచి మంటలు చెలరేగాయి. జోయా లుకాస్ జ్యుయెలరీ షాప్‌కు ఎదురుగా ఉన్న పిల్లర్ నుంచి దట్టమైన పొగలు రావడంతో.. వాహనదారులు, పాదచారులు బెంబేలెత్తిపోయారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. ఏదో పెద్ద ప్రమాదమే జరిగిందని వణికిపోయారు. అసలు ఏం జరిగిదంటే.. పంజాగుట్ట ఫ్లైఓవర్‌ను ఇటీవల డెకరేషన్ చేశారు. పిల్లర్స్‌కు పలు ప్లాస్టిక్ వస్తువులతో పాటు విద్యుత్ దీపాలు ఏర్పాటుచేశారు. డెకరేషన్‌లో భాగంగా పిల్లర్స్‌ను కూడా అందంగా అలకంరించారు. శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పిల్లర్ నుంచి మంటలు చెలరేగాయి. అనంతరం దట్టమైన పొగలు వ్యాపించాయి. రోడ్డు మొత్తం నల్లటి పొగలు కమ్ముకోవడంతో అందరు భయభ్రాంతులకు గురయ్యారు.

  వాహనదారులు ఉక్కిరిబిక్కిరవడంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమై.. అన్ని వైపులా ట్రాఫిక్‌ను నిలిపివేశారు. కాసేపటికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లర్‌కు డెకరేషన్ చేసిన వారిని ఆరాతీస్తున్నారు. కాగా, నగరం నడిబొడ్డున నడి రోడ్డుపై జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఘటనా స్థలానికి కూతవేటు దూరంలోనే సీఎం నివాసం ఉండడంతో పోలీసులు కూడా ఉరుకులు పరుగులు పెట్టారు. మంటలు అదుపులోకి రావడం.. ఎలాంటి నష్టం జరగకపోవడంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Fire Accident, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు