Home /News /telangana /

HEAVY RAINS IN TELANGANA AND TOWNS OF BHAINSA AND NIRMAL IN ADILABAD WERE SUBMERGED ADB PRV

Rains in Telangana: జలమయమైన నిర్మల్​, భైంసా పట్టణాలు.. తెప్పలు, తాళ్లతో బాధితుల తరలింపు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఎడతెరిపి లేకుండా గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లా తడిసి ముద్దయ్యింది. మరోసారి నిర్మల్, భైంసా పట్టణాలు జలమయమయ్యాయి.

    ఎడతెరిపి లేకుండా గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి (Rains) ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లా తడిసి ముద్దయ్యింది. మరోసారి నిర్మల్, భైంసా పట్టణాలు జలమయమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో సింగరేణి ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. నిర్మల్ (Nirmal) జిల్లా కడెం ప్రాజెక్టు 9 వరద గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి నీటి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు, ప్రస్తుతం 694.175 అడుగులు కాగా, ఇన్ ఫ్లో 64000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 64000  క్యూసెక్కులు. వర్షం నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

    తెప్పలు, తాళ్ళ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు..

    కాగా నిర్మల్ (Nirmal) జిల్లా బాసర లోని రవీంద్రపురి కాలనినీ వరద నీరు ముంచెత్తింది. వరద నీటిలో చిక్కుకున్న కాలనీ వాసులను పోలీసులు, స్థానికులు గజ ఈతగాళ్ళు తెప్పలు, తాళ్ళ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  భారీ వర్షాల కారణంగా గడ్డెన్న వాగుకు సంబంధించిన నాలుగు గేట్లు, స్వర్ణ ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తి వరద నీటిని దిగువకు వదిలిపెట్టారు. పలుచోట్ల వరద నీరు రోడ్లపైకి చేరి రాకపోకలకు అంతరాయం కలిగింది.  నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసి బస్టాండ్ నీట మునిగింది. వర్షం నీరు బస్టాండ్ లోకి చొచ్చుకుపోయింది.



    ఖానాపూర్ పట్త్టణ శివారులోని వాగు ఉప్పొంగి ప్రవహించడంతో సుమారు పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా జిల్లాలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ అలీ ఫారుఖీ పర్యటించారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు.  సంబంధిత  అధికారులు  ఫీల్డ్ లోనే  ఉండి  విధులు  నిర్వహించేలా ఆదేశాలిచ్చారు. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు  అప్రమత్తంగా  ఉండాలని,  ప్రభుత్వ  ఆదేశాలు పాటిస్తూ అవసరమైతేనే  బయటకు  రావాలని సూచించారు. భారీ నుంచి  అతిభారీ  వర్షాలు రెండు, మూడు రోజులు  కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు  జాగ్రత్తగా  ఉండాలని కోరారు.

    మరోవైపు మంచిర్యాల జిల్లాలో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. ఓపెన్ కాస్టు గనుల్లోకి భారీగా వరద వచ్చి చేరింది. కాసిపేట కెకె3, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, ఖైరిగూడ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. రెండురోజుల్లో సుమారు 30 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా.

    భారీ వర్షాల కారణంగా  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలలో ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు, నదులు, ప్రాజెక్టులు, నిండు కుండలా జలకలను సంచరించుకుంటున్నాయి.  అక్కడక్కడ ప్రమాదకర స్థాయిని తలపిస్తూ నీరు వరద ప్రవహిస్తోంది. ఈ క్రమంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై లోతట్టు ప్రాంతాలను, ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను తనిఖీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అధిక వర్షాలు దృశ్య రక్షణ చర్యలను తీసుకోవాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, వాగులు, నదుల వద్ద ప్రమాదకర సాయం స్థాయిని పరిశీలించి రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, Heavy Rains, Nirmal

    తదుపరి వార్తలు