Telangana Weather Report: తెలంగాణలో భారీ వర్షాలు... ఈ ప్రాంతాల్లో...

ప్రతీకాత్మక చిత్రం

Telangana Weather Report: గ్రేటర్‌ హైద‌రా‌బా‌ద్‌లో వ‌చ్చే మూడురోజులు సాధార‌ణం నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతా‌వ‌రణ కేంద్రం తెలిపింది.

  • Share this:
    ఉత్తర కర్ణా‌టక నుంచి దక్షిణ తమి‌ళ‌నాడు వరకు 0.9 కిలో‌మీ‌టర్ల వరకు ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్పడిందని... దీని ప్రభావంతో తెలంగాణలోని ప‌లు ప్రాంతాల్లో ఇవాళ, రేపు, భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభా‌వంతో పలు చోట్ల ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నట్టు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలిపింది. హైద‌రా‌బాద్‌, రంగా‌రెడ్డి, ఉమ్మడి మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నల్లగొండ, ఆది‌లా‌బాద్‌, నిజా‌మా‌బాద్‌ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నట్లు వివరించింది. గ్రేటర్‌ హైద‌రా‌బా‌ద్‌లో వ‌చ్చే మూడురోజులు సాధార‌ణం నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతా‌వ‌రణ కేంద్రం తెలిపింది. ఇక ప్రస్తుతం తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పగటి ఉష్టోగ్రతలు ఎక్కువగా ఉంటున్నా.. సాయంత్రానికి జల్లులు పడుతున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: