హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mancherial: గోదావరి వరదలో చిక్కుకున్న మేకల కాపరులు, వెంటనే వచ్చేసిన హెలికాప్టర్

Mancherial: గోదావరి వరదలో చిక్కుకున్న మేకల కాపరులు, వెంటనే వచ్చేసిన హెలికాప్టర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల  కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ అయోమయం అవుతున్నారు. ఈ వరదల కారణంగా పంట నష్టాలు జరుగుతున్నాయి.

  గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల  కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ అయోమయం అవుతున్నారు. ఈ వరదల కారణంగా పంట నష్టాలు జరుగుతున్నాయి. వరద ఉద్రిక్తత రోజు రోజుకి పెరుగుతుంది. వర్షాల కారణంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. వర్షాల కారణంగా  గోదావరి నీళ్లు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి వరదలో చిక్కుకున్న మేకల కాపరులు, వెంటనే వచ్చేసిన హెలికాప్టర్. హెలికాప్టర్ తో రక్షించిన సహాయ బృందాలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సోమన్ పల్లి వద్ద గోదావరి వరదలో చిక్కుకున్న ఇద్దరి వ్యక్తులను గురువారం హెలికాప్టర్ ద్వారా రక్షించారు. భారీ వర్షాల కారణంగా వరద నీరు ఊరిలోకి రాగ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మేకలను కాసేందుకు వెళ్లిన కాపరులు వెనక్కి వచ్చే సమయంలో వరద ముంచెత్తింది.

  వరద ఉధృతి వల్ల అక్కడే ఉండిపోయారు.  దీంతో వారిద్దరూ అక్కడున్న వాటర్ ట్యాంక్ ఎక్కేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వారిని కాపాడడానికి మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు.  దీంతో మంత్రి  ఆదేశాలతో సహాయ బృందాలు రంగంలోకి దిగాయి.  హెలికాప్టర్ సాయంతో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తులను కాపాడారు. మేకల కాపరులు కాపాడినందుకు  ఎమ్మెల్యే బాల్క సుమన్, మంత్రి కేటిఆర్ లకు ప్రజలు,కాపరులు  ధన్యవాదాలు తెలిపారు.

  చుట్టూ పక్కల 2  కిలోమీటర్ల మేర నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లా ను కలుపుతున్న గోదావరి బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఈ వరద ఉధృతిని పరిశీలించేందుకు రామగుండం పోలీస్

  కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్ అధికారులతో కలిసి పరిస్థితులను పరిశీలించారు.

  బ్రిడ్జ్ కు ఇరువైపుల నుంచి వరద నీరు ప్రవహిస్తుంది కావున వాహనాలు దారి మళ్లించాలని, అధికారులు, సిబ్బంది స్థానికంగా

  ఉంటూ అప్రమత్తంగా వ్యవహారించాలని సీపీ సూచించారు. ఇది ఇలా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు నెలల బాబును వరదల నుంచి కాపాడుకోవడానికి మంథని

  పట్టణంలోని మరివాడలో ఉన్న ఓ వ్యక్తి బాబును పళ్లెంలో బాబును పెట్టుకుని మెడలోతు నీటిలో సురక్షితంగా తీసుకొని వెళ్లాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.  మూడు నెలల బాబు ని కాపాడినందుకు గాను ఆ వ్యక్తిని ప్రజలు మెచ్చుకుంటున్నారు.

  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Heavy Rains, Mancherial, Telangana

  ఉత్తమ కథలు