Home /News /telangana /

HEAVY RAINS IN KARIMNAGAR AND ADILABAD VRY

Rain : బీభత్సం సృష్టించిన వర్షం. సుమారు గంటపాటు ఎడతెరపి లేకుండా .. హోర్డింగ్‌ నేలమట్టం.

RAIN

RAIN

Rain : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ( Karimnagar ) సుమారు రెండు గంటల పాటు కురిసిన వర్షం ( Rain ) జిల్లా ప్రజలను అతలాకుతలం చేసింది. విద్యుత్ ఆగిపోవడంతో పాటు ఈదురు గాలులు, రోడ్లన్ని జలమయం అయ్యాయి.

    తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేడు విపరీతమైన వర్షాలు కురిశాయి.. వర్షానికి కరీంనగర్ పట్టణంలోని సుమారు 70 అడుగులతో ఏర్పాటు చేసిన అతిపెద్ద హోర్డింగ్ కూలిపోయింది. విద్యుత్ స్థంభాలు సైతం నెలకొరిగిన పరిస్థితి కనిపించింది. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, రామడుగు, మానకొండూరు,పెద్ద పల్లి మండలలాతో పాటు సిరిసిల్ల జిల్లాలో కూడా భారి వర్షం కురిసింది.

    ఇక ఆదిలాబాద్‌లో సైతం వర్షాలు కురుస్తుండడతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఒకపక్క పగటి ఉష్ణొగ్రతలు పడిపోయి చల్లటి గాలులు వీస్తూ జనాలను వణికిస్తుంటే గత రెండు రోజులుగా అకాల వర్షం హడలెత్తిస్తోంది. తెల్లవారుజాము నుండే మబ్బులు ఆవరించి వాతావరణాన్ని చల్లబరిచాయి... దీనికి తోడు చల్లటి గాలులు, సాయంత్రం పూట వర్షం తోడవడంతో చలి తీవ్రత పెరిగింది..

    Corona : కరోనా ఎఫెక్ట్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు. ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ కేసులకే చికిత్స,


    ఈ క్రమంలోనే జిల్లాలోని పలు మండలాల్లో గత రెండు రోజుల్లో వడగళ్ళ వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని మండలాల్లో తేలికపాటి జల్లులు కురిస్తే, మరికొన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షాపాతం ( Rain ) నమోదైంది. మరికొన్ని చోట్ల వడగళ్ళతో కూడిన వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాలో ( Power cut ) అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు, నార్నూర్, ఇంద్రవెల్లి, భీంపూర్ మండలాలతోపాటు ఇంకా పలు మండలాల్లో వర్షం భీభత్సం సృష్టించింది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Karimnagar, Rain

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు