మరోసారి వర్షాలు హైదారాబాద్‌ను ముంచెత్తాయి.. నగరంలోని పలు చోట్ల వర్షంతో రోడ్లు జలమయ్యాయి. కొన్ని చోట్ల వర్షంలోనే బతుకమ్మ ఉత్సవాలు సైతం నిర్వహించారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
గత నెల రోజులుగా హైదరారాబాద్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వర్షాలు మరోసారి నేటి సాయంత్రం రోడ్లను ముంచెత్తాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడడంతో రోడ్లన్ని జలమయ్యాయి. కాలువలు ఉప్పొంగడంతోపాటు కాలనీల్లోకి నీళ్లు చేరాయి..
దీంతో గత పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న జీహెచ్‌ఎంసీ ముందుజాగ్రత్త చర్యగా హై అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు రంగంలోకి దిగారు. ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా కాలువలు, మెట్రో స్టేషన్ల క్రింద చేరిన వరద నీటిని కాలువల్లోకి పంపిస్తున్నారు. వర్షం కారణంగా భారీగానే ట్రాఫిక్ సైతం నిలిచి పోయింది. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో వర్షం పడడంతో ఆయా ప్రాంతాల్లో నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటికి చేరే సమయంలో వర్షం పడడంతో వర్షంలోనే ఇంటికి చేరుకునే ప్రయత్నం చేశారు. దీంతో మ్యాన్‌హోల్స్‌తోపాటు చిన్న చిన్న గుంతల వద్ద ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.
కాగా వర్షం ఎక్కువగా కూకట్‌పల్లితో పాటుట పాతబస్తి, బంజారాహిల్స్, ఇటు దిల్‌సుఖ్‌నగర్ నుండి ఏల్‌బీనగర్ ప్రాంతాలతోపాటు అంబర్‌పేట్ ఉప్పల్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. కాగా ఇటివల కురిసిన వర్షాలకు ఇద్దరు వ్యక్తులు గల్లంతయిన విషయం తెలిసిందే.. దీంతో వర్షాల సమయంలో బయటికి రాకుండా ఉండాలని అధికారులు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GHMC, Hyderbad, Rain alert