news18-telugu
Updated: August 19, 2020, 4:52 PM IST
ప్రతీకాత్మక చిత్రం
Telangana Rains: ఈశాన్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వలన నేడు గంటలకు ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారి వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణించి రాగల 24 గంటలలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ప్రభావంతో ఈరోజు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఈ రోజు ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు బంగాళాఖాతంలో ఆగస్టు 23 తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
Published by:
Kishore Akkaladevi
First published:
August 19, 2020, 4:52 PM IST