విడవని వాన.. హైదరాబాద్‌ను మళ్లీ ముంచెత్తిన అతి భారీ వర్షం..

Hyderabad Rains : ఉపరితల ఆవర్తనం,ద్రోణి ప్రభావంతో రానున్న 48 గంటల్లో హైదరాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

news18-telugu
Updated: September 26, 2019, 7:09 AM IST
విడవని వాన.. హైదరాబాద్‌ను మళ్లీ ముంచెత్తిన అతి భారీ వర్షం..
హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతతో నగర వీధులు జలమయమయ్యాయి.
  • Share this:
హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి 8.34గం.వరకు కుండపోత వర్షం కురిసింది. సనత్‌నగర్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి,బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, మాదాపూర్, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్,రామ్‌నగర్,విద్యానగర్,హిమాయత్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది.వర్షం కారణంగా నగరంలో చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరడంతో.. రాత్రంతా వారు జాగారం చేయాల్సి వచ్చింది.

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని ఖైరతాబాద్ శ్రీనగర్ కాలనీలో అత్యధికంగా 5.4 సెం.మీ వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఆసిఫ్‌నగర్‌లో 5.3 సెం.మీ., హిమాయత్‌నగర్‌లో 5.2 సెం.మీ., నాంపల్లిలో 5.1 సెం.మీ., కూకట్‌పల్లిలో 5 సెం.మీ. వర్షపాతం నమోదైనట్టు చెప్పారు.ఉపరితల ఆవర్తనం,ద్రోణి ప్రభావంతో రానున్న 48 గంటల్లో హైదరాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాగా,సెప్టెంబర్ నెలలో రాష్ట్రంలో విస్తారమైన వర్షపాతం నమోదైంది. శతాబ్ద కాలంలో మునుపెన్నడూ లేనంత రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. మల్కాజ్‌గిరి లాంటి ప్రాంతాల్లో 20సెం.మీ వర్షపాతం నమోదవడం విశేషం.
Published by: Srinivas Mittapalli
First published: September 26, 2019, 7:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading