తెలంగాణలో భారీ వర్ష సూచన...ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు...

ఇదిలా ఉంటే తెలంగాణలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే, ఈ సంవత్సరం మూడు శాతం తక్కువగా కురిశాయని, రానున్న రోజుల్లో భారీవర్షాల కురవనుండడంతో సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలున్నాయి. అలాగే తెలంగాణతోపాటు ఏపీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

news18-telugu
Updated: September 16, 2019, 11:16 PM IST
తెలంగాణలో భారీ వర్ష సూచన...ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో రానున్న నాలుగు రోజులపాటు పలు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఏపీలో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణలో ఈ నెల 19వ తేదీ వరకూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో వ్యవసాయదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే, ఈ సంవత్సరం మూడు శాతం తక్కువగా కురిశాయని, రానున్న రోజుల్లో భారీవర్షాల కురవనుండడంతో సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలున్నాయి. అలాగే తెలంగాణతోపాటు ఏపీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
Published by: Krishna Adithya
First published: September 16, 2019, 11:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading