బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు,రేపు తెలంగాణలో భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం అల్ప పీడనంగా మారడంతో.. రాబోయే 24 గంటల్లో తెలంగాణలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణశాఖ అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: September 18, 2019, 8:38 AM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు,రేపు తెలంగాణలో భారీ వర్షాలు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 18, 2019, 8:38 AM IST
హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం వరకు వర్షం కురుస్తూనే ఉండటంతో చాలా ప్రాంతాలు జలమయం అయిపోయాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూకట్‌పల్లి,మెహిదీపట్నం,లింగంపల్లి,అమీర్‌పేట్,ఖైరతాబాద్ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.

కాగా, బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం అల్ప పీడనంగా మారడంతో.. రాబోయే 24 గంటల్లో తెలంగాణలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణశాఖ అధికారులు తెలిపారు. అటు రాయలసీమలోనూ తేలికపాటి జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే, ఈసారి జూన్‌లో ఆశించినంత వర్షాలు లేనప్పటికీ.. అగస్టు,సెప్టెంబర్‌లలో తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యాయి.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...