Telangana Weather: తెలంగాణలో భారీ వర్షాలు.. రాబోయే మూడు రోజులపాటు..

Telangana Weather: తెలంగాణలో భారీ వర్షాలు.. రాబోయే మూడు రోజులపాటు..

Rains in Telangana: తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

  • Share this:
    బంగాళాఖాతంలో ఈ రోజు ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తెలంగాణపై ఉండనుందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. దీని అనుబంధంగా మధ్యస్థట్రోపోస్పీయర్ స్థాయిలో ఎత్తు వరకు ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదిలాబాద్, కొమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్ధిపేట, భూపాల్ పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మేడ్చల్, హైదరాబాద్ రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    ఈ జిల్లాల్లో రేపు, ఎల్లుండి కూడా ఇదే రకమైన పరిస్థితి ఉండొచ్చని అభిప్రాయపడింది. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో... ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వాతావరణశాఖ సూచనల మేరకు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలతో పాటు కృష్ణా, గోదావరి పరివాహాక ప్రాంతాల జిల్లా అధికారులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం సూచనలు చేస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: