రాబోయే రెండు మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు (Telangana Rains) దంచి కొట్టనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ (ఐఎండీ) (Hyderabad IMD) జూన్ 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
IMD నివేధిక ప్రకారం హైదరాబాద్ సిటీ సహా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈదురుల గాలులు వేసే అవకాశాలు ఉంది. రానున్న రోజుల్లో కొమరం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, జోగులాంబ గద్వాల్ ,పెద్దపల్లి, యాదాద్రి భువనగరి. జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.
భారీ వర్షాలకు తొడు కొన్ని ప్రాంతాల్లో ఈదులు గాలులు కూడా విచే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పెద్దపల్లి, నల్గొండ, యాదాద్రి భువనగరి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో ఆదివారం మద్యహ్నం నుంచి కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో, రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం మహబూబ్‌నగర్‌లోని జడ్చర్లలో (89.1 మిమీ) నమోదైంది. హైదరాబాద్‌లో అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరిలోని బాచ్పల్లెలో 7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తెలంగాణలో ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే వచ్చేశాయి. నైరుతి రుతుపవన మెఘాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి.ఈ కారణం వలనే తెలంగాణలో మే చివరి వారం నుంచే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడడం ప్రారంభించాయి. జూన్‌లో వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి, ఆదిలాబాద్‌లో రాష్ట్రంలో అత్యధికంగా 106 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ ఏడాది ఇప్పటి వరకు ఖమ్మం వాతావరణ కేంద్రంలో 91 మి.మీ, రామగుండం స్టేషన్లో 88 మి.మీ వర్షం కురిసింది. జూన్ 1 నుంచి మూడు జిల్లాల్లో అధిక వర్షపాతం, ఏడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 22 జిల్లాల్లో లోటు వర్షపాతం, ఒక జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వేసవి తాపం కూడా క్రమంగా తగ్గింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా రాష్ట్రవ్యాప్తంగా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
గత 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెంలోని ఆళ్లపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 39.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో అత్యధికంగా తిరుమలగిరిలో 36.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ తోపాటు తెలంగానలో పలు ప్రాంతాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ దిశగా అధికారులు కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Heavy Rains, Hyderabad Rains, IMD, Rain alert, Telangana rains, Weather report