Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం.. మరో గంటపాటు..

భారీ వర్షాల కారణంగా మునిగిన వాహనాలు

Hyderabad: నగరంలోని ప్రజలెవరూ బయటకు రావొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. నగరవాసులు ఇళ్లలోనే ఉండాలని సూచించింది.

  • Share this:
    హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు, కాలనీవాసులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. పాతబస్తీ ప్రాంతంలో పలు కాలనీలు మునిగాయి. 44వ జాతీయ రహదారి చెరువును తలపిస్తోంది. సైదాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. కూకట్‌పల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ, ముషీరాబాద్, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, రామ్‌నగర్, కవాడిగూడ, ఇందిరాపార్క్, దోమలగూడ, విద్యానగర్, అడిక్‌మెట్‌, రాజేంద్రనగర్, మేడ్చల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సింగరేణి కాలనీ కృష్ణానగర్ నీట మునిగింది. హైదరాబాద్‌లో గంటపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని విపత్తుల శాఖ సంస్థ సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.

    నగర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌తోపాటు చార్మీనార్‌లో భారీగా వాన కురిసింది. అత్యధికంగా బహదూర్‌పురాలో 9 సెంటీమీటర్లు, చార్మినార్‌లో 5.5 సెంటీమీటర్లు, సైదాబాద్‌లో 4 సెంటీమీటర్లు, ఝాన్సీబజార్‌లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.నగరంలో ఒక్కసారిగా వాన కురవడంతో రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతున్నది. భారీ వానతో రోడ్లపై నీరు నిలువకుండా జీహెచ్‌ఎంసీ సిబ్బంది, అధికారులు జాగ్రత్తపడుతున్నారు.

    రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి, నేడు దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కోమరిన్ తీరం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తున కొనసాగుతుందని అధికారులు వివరించారు.

    Green Chilli: పచ్చి మిర్చిను దూరం పెడుతున్నారా ?..ఈ ప్రయోజనాలు మిస్ అవుతారు

    Revanth Reddy: యముడి గెటప్‌లో రేవంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

    వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఈ రోజు గంగేటిక్ పరిసర ప్రాంతాల్లో ఉండి సగటు సముద్రమట్టం నుంచి 5.8 కి.మీ వరకు కొనసాగుతుందని వారు వివరించారు. దాని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
    Published by:Kishore Akkaladevi
    First published: