హోమ్ /వార్తలు /తెలంగాణ /

Heavy Rain | Power Cut: హైదరాబాద్‌లో భయానక వర్షం.. కరెంట్ కట్! -తెలంగాణ, ఏపీలో చాలా చోట్ల కూడా..

Heavy Rain | Power Cut: హైదరాబాద్‌లో భయానక వర్షం.. కరెంట్ కట్! -తెలంగాణ, ఏపీలో చాలా చోట్ల కూడా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ అకాల వర్షబీభత్సానికి వణికిపోయింది. అప్పటిదాకా ఉక్కపోతతో సతమతమైన నగరవాసులు.. బుధవారం తెల్లవారుజాము నుంచి కురుస్తోన్న వర్షానికి అతలాకుతలం అయ్యారు. దాదాపు సిటీ అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది..

విశ్వనగరం హైదరాబాద్ అకాల వర్షబీభత్సానికి వణికిపోయింది. అప్పటిదాకా ఉక్కపోతతో సతమతమైన నగరవాసులు.. బుధవారం తెల్లవారుజాము నుంచి కురుస్తోన్న వర్షానికి అతలాకుతలం అయ్యారు. దాదాపు సిటీ అంతటా విరామం లేకుండా గంటన్నరకుపైగా ఉరుములు, మెరుపులతో కూడిన వాన దంచికొట్టింది. భారీ వర్షం దెబ్బకు నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు నగరమంతా కరెంటు కోతను ఎదుర్కొంటున్నది. హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాలు అలాగే ఆంధ్రప్రదేశ్ లోనూ చాలా చోట్ల ఇవాళ ఉదయం భారీ వర్షాలు కురిశాయి.

ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో బుధవారం ఉదయం 6.30 తర్వాత కూడా వర్షం పడుతోంది.

CM KCR గూడుపుఠాని.. ప్రశాంత్ కిషోర్ సర్వే సంచలనం.. కేఏ పాల్ ప్రధాన ప్రత్యర్థి?: Revanth Reddy


ఖైరతాబాద్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్‌, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బేగంపేట్‌, సైదాబాద్‌, చంపాపేట, సరూర్‌నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, నాగోల్‌, చైతన్యపురి, వనస్థలిపురం, హయత్ నగర్, తుర్కయంజాల్, పెద్ద అంబర్‌పేట్‌, అబ్దుల్లాపుర్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.

Smita Sabharwal: సీఎం కేసీఆర్ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు హైకోర్టు భారీ షాక్.. అసలేం జరిగిందంటే..


భారీ వర్షానికి నగరంలోని రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. పలు కాలనీలు నీటిమయమయ్యాయి. పంజాగుట్ట కూడలి వద్ద భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొన్నిరోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న నగర ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించినట్లైంది.

First published:

Tags: Heavy Rains, Hyderabad, Hyderabad Heavy Rains, Power cuts, Rains, Telangana, WEATHER

ఉత్తమ కథలు