హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad Rains: ఇది మన హైదరాబాదే.. కాలనీల్లో కాగితపు పడవల్లా కొట్టుకుపోయిన బైక్‌లు

Hyderabad Rains: ఇది మన హైదరాబాదే.. కాలనీల్లో కాగితపు పడవల్లా కొట్టుకుపోయిన బైక్‌లు

హైదరాబాద్‌లో వర్ష బీభత్స దృశ్యాలు

హైదరాబాద్‌లో వర్ష బీభత్స దృశ్యాలు

Hyderabad Rains: బాలానగర్‌లో అత్యధికంగా 10.4 సెం.మీల వాన కురిసింది. తిరుమలగిరిలో 9.5, కూకట్‌పల్లిలో 9.4, అల్వాల్‌లో 9.4, వెస్ట్ మారేడ్ పల్లిలో 9.3 సెం.మీ. కుత్బుల్లాపూర్‌లో 9.2, బీరంగూడలో 8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌లో రాత్రంతా వర్షం (Hyderabad Rains) దంచికొట్టింది. వరుణుడు పగబట్టాడా? ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లుగా  కుండపోత వాన కురిసింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో జడి వాన పడింది. ఎడతెరిపి లేని వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు కాలువల్లా మారిపోయాయి. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్‌లు, ఆటోలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. రాత్రి 8 గంటల సమయంలో కొన్ని ప్రాంతాల్లో మొదలైన వర్షం.. ఆ తర్వాత నగరమంతటా విస్తరించింది. దాదాపు 4 గంటల పాటు ఎడతెరిపి లేకుండా విరుచుకుపడింది. ఈ వర్షం దెబ్బకు నాలలు ఉప్పొంగి ప్రవహించాయి. రోడ్లు నదులను తలపించాయి. కొన్ని చోట్ల వరద నీరు ఇళ్లల్లోకి రావడంతో.. జనాలు ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్‌లో వర్ష బీభత్స దృశ్యాలను ఇక్కడ చూద్దాం.

బోరబండ ప్రాంతంలో వరద ప్రవాహంలో పడిపోయిన ఓ వ్యక్తి. కొట్టుకుపోతున్న అతడి బైక్ .

బోరబండలోని ఓ కాలనీలో వరదలో కొట్టుకుపోతున్న ఆటోలు, బైక్‌లు

యూసఫ్ గూడలో కాల్వలా మారిన ఓ కాలనీ

బోరబండలోని కాలనీల్లో వరద ప్రవాహ దృశ్యాలు

ఓ కాలనీలో మోకాల్లోతు నీటిలో ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్తున్న డెలివరీ బాయ్

రాత్రి కురిసిన వర్షానికి నగరంలో భారీ స్థాయిలో వర్షపాతం నమోదయింది. బాలానగర్‌లో అత్యధికంగా 10.4 సెం.మీల వాన కురిసింది. తిరుమలగిరిలో 9.5, కూకట్‌పల్లిలో 9.4, అల్వాల్‌లో 9.4, వెస్ట్ మారేడ్ పల్లిలో 9.3 సెం.మీ. కుత్బుల్లాపూర్‌లో 9.2, బీరంగూడలో 8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.

First published:

Tags: Heavy Rains, Hyderabad, Telangana, Telangana rains

ఉత్తమ కథలు