హైదరాబాద్ లో భారీ వర్షం...పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం....

వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు ఎమర్జెన్సీ బృందాలను అలర్ట్ చేశాయి.

news18-telugu
Updated: May 21, 2019, 11:13 PM IST
హైదరాబాద్ లో భారీ వర్షం...పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం....
వానలు కురిస్తే హాయి (File Image)
news18-telugu
Updated: May 21, 2019, 11:13 PM IST
నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మండిపోతున్న ఎండలతో తాళలేకపోతున్న నగరవాసులకు వర్షం రాకతో వాతావరణం కాస్త చల్లబడింది. ముఖ్యంగా కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌, ఉప్పల్, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయ్యింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు ఎమర్జెన్సీ బృందాలను అలర్ట్ చేశాయి. మరోవైపు ఈదురు గాలులతో నగరంలో పలుచోట్ల చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

అలాగే నగర శివరు ప్రాంతాలైన మేడ్చల్, కీసర, కాప్రా మండలాల్లోని పలు గ్రామాల్లో తీవ్ర గాలులతో కూడిన వర్షం పడింది. రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలలో వేగంగా గాలులు వీచాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.

First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...