హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. మిగిలిన ఈ ప్రాంతాల్లోనూ..

ప్రతీకాత్మక చిత్రం

ఆదివారం సైతం పలుచోట్ల ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

  • Share this:
    నైరుతి రుతుపవనాలు సకాలంలో సమయానికి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గర పశ్చిమ బంగాళాఖాతంలో 3.1 ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆవర్తన ప్రభావంతో సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, యాదాద్రిభువనగిరి, మహబూబ్ నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో శనివారం ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం సైతం పలుచోట్ల ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

    ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీనికితోడు నైరుతి రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శని, ఆదివారాల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
    Published by:Narsimha Badhini
    First published: