తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్నిచోట్ల సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

news18-telugu
Updated: September 2, 2019, 8:22 AM IST
తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్నిచోట్ల సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మరో 24 గంటల్లో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. రానున్న 24 గంటల్లో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన మూడురోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. మిడ్ మానేరు రిజర్వాయర్‌కు కూడా వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తివేసి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. రాజధాని నగరంలో కూడా వానలు ముంచెత్తుతున్నాయి. వాతావరణం చల్లగా మారింది.
Published by: Sulthana Begum Shaik
First published: September 2, 2019, 8:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading