Home /News /telangana /

HEAVY JOLT TO TELANGANA CONGRESS AS PRASHANT KISHOR CONTINUES TO BE CM KCR TRS STRATEGIST REVANTH REDDY TO DEFFER MKS

Telangana Congress : రేవంత్‌కు దిమ్మతిరిగే షాక్.. KCR-PK దోస్తీపై డైలమాలో టీకాంగ్రెస్

కేసీఆర్, రేవంత్, పీకే

కేసీఆర్, రేవంత్, పీకే

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ భారీ డైలమాలో కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీలో చేరికకు సర్వం సిద్దం చేసుకున్న పీకే గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ వచ్చి, టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.

ఆయన వ్యూహాలనే అమలు చేద్దామంటోన్న హైకమాండ్ ఒకవైపు.. ఆయనేమో ఇక్కడి ప్రత్యర్థితో అంటకాగుతోన్న తీరు మరోవైపు.. తిట్టిపోద్దామంటూ అధినేత్రికి ఆగ్రహం.. సూచనలు స్వీకరిద్దామంటే ఎనలేని అనుమానం.. వెరసి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ భారీ డైలమాలో కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీలో చేరికకు సర్వం సిద్దం చేసుకున్న ప్రశాంత్ కిషోర్ గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ వచ్చి, టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో భేటీ అయి, రాత్రి ప్రగతి భవన్ లోనే విడిది చేశారు. ఈ పరిణామాలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా నేతలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయని తెలుస్తోంది.

నిజానికి ప్రశాంత్ కిషోర్ ను ముందు నుంచీ వ్యతిరేకిస్తోన్న టీపీసీసీ రేవంత్ రెడ్డి గతంలో తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కోటరీలో బీహార్ కు చెందిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల ప్రాబల్యాన్ని ‘బీహారీ దొంగల ముఠా’గా అభివర్ణించిన రేవంత్.. ఆ ముఠాకు పీకే కూడా తోడయ్యాడని, ఎందరు పీకేలు వచ్చినా టీకాంగ్రెస్ ను ఏమీ పీకలేరనీ రేవంత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో పీకే చేరికకు అడ్డంకిగా ఉన్న ఏకైక అంశం ‘ప్రత్యర్థులకు వ్యూహరచనలు చేయడం’అని ప్రస్పుటంగా వెల్లడైన తర్వాత కూడా, అటు ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరికకు ప్రయత్నిస్తూ, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యర్థి టీఆర్ఎస్ కు స్ట్రాటజిస్టుగా పీకే కొనసాగడాన్ని స్థానిక నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.

Prashant Kishor విషయంలో CM KCR అనూహ్య వ్యూహం! -TRSలో చంద్రబాబు ఫార్ములా?


ఈ వారంలోనే నాలుగు రోజుల వ్యవధిలో మూడు సార్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్.. 2024 సార్వత్రిక ఎన్నికలు, త్వరలో జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కావాల్సిన వ్యూహాలను అందజేశారు. పీకే కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైన దరిమిలా గుజరాత్ కు చెందిన పటేల్ ఉద్యమ నేతలు ఆయనతో టచ్ లోకి వచ్చారు. వ్యూహకర్తగా కంటే కార్యకర్తగానే కాంగ్రెస్ కు పీకే సేవలు అందించబోతున్నట్లు ఏఐసీసీ వర్గాలు వ్యాఖ్యానాలు చేయడం, దేశానికే బ్రాండ్ లా మారిన పీకే కాంగ్రెస్ లోకి రావాలనుకోవడం శుభపరిణామమని సోనియా విధేయుడైన రాజస్థాన్ సీఎం గెహ్లాట్ అనడం తదితర పరిణామాలు పీకే ఎంట్రీ గ్రాండ్ గా ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చినట్లయింది. కానీ ప్రశాంత్ కిషోర్ సైలెంటుగా కాంగ్రెస్ ప్రత్యర్థులతో భేటీ కావడం తాజా సంచలనంగా మారింది.

BJP నాకు ఉప ప్రధాని పదవి ఆఫరిచ్చింది.. ఇక KCR కథ ముగిసింది: KA Paul మరో బాంబు


ఢిల్లీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా శనివారమే హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ కిషోర్.. నేరుగా సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్ తో సుదీర్ఘ మతనాలు జరిపారు. ఆదివారం కూడా వీరు దఫాలుగా పలు అంశాలను చర్చించుకోనున్నట్లు తెలుస్తోంది. అందుకు వీలుగా పీకే శనివారం రాత్రి ప్రగతి భవన్ లోనే బస చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ లో చేరిక ప్రయత్నాలు ఆరంభించడం కంటే ముందే తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా పనిచేయాలని పీకే నిర్ణయించుకున్న క్రమంలో.. ఒప్పందాల మేరకు తాను టీఆర్ఎస్ తోనే కలిసి పని చేస్తానని పీకే స్పష్టం చేసినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో సర్వే రిపోర్టు, ఈనెల 27న జరగనున్న టీఆర్ఎస్ ఆవిర్భావ సభ, కాంగ్రెస్ హైకమాండ్ తో జరిపిన సమావేశాల గురించి కేసీఆర్-పీకే చర్చించుకున్నట్లు వెల్లడైంది. ఈ పరిణామం..

KCR - TRS మళ్లీ గెలిస్తే గొంతు కోసుకుంటా.. నవంబర్ 20 డెడ్‌లైన్: BJP ఎంపీ అరవింద్ సంచలన సవాలు


కాంగ్రెస్ లో చేరికకు సిద్ధమైన ప్రశాంత్ కిషోర్ సడన్ గా హైదరాబాద వచ్చి గులాబీ బాస్ ను కలవడంపై టీకాంగ్రెస్ లో భిన్నవాదనలు కూడా వినిపిస్తున్నాయి. కేసీఆర్ కు కటీఫ్ చెప్పడానికే పీకే ప్రగతి భవన్ వచ్చారని, ఆ పనిని గౌరవ ప్రదంగా చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ కోరిక మేరకు రెండు రోజుల పాటు కలిసుండటానికి అంగీకరించారని, బహుశా ఇది కేసీఆర్-పీకే ఆఖరి సమావేశం కావొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి కొందరు నేతలు మాత్రం.. పీకే కాంగ్రెస్ లో చేరబోవడంలేదని, వ్యూహకర్తగా మాత్రమే పనిచేస్తారని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ పట్ల పీకే వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టిందనే వాదనకు మాత్రం అందరూ అంగీకరిస్తున్న పరిస్థితి.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Congress, Prashant kishor, Revanth Reddy, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు