Nirmal Town: జల దిగ్బంధంలో నిర్మల్.. అప్రమత్తమైన అధికారులు.. ప్రమాద హెచ్చరికలు జారీ..

నీట మునిగిన గ్రామం

Nirmal town: ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తడిసి ముద్దవుతోంది. జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం అతలాకుతలమవుతోంది. ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్రలోనూ భారీగా వానలు పడుతుండటంతో జిల్లా సరిహద్దున ఉన్న పెన్ గంగా నదిలో వరద నీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తోంది.

  • Share this:
    ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తడిసి ముద్దవుతోంది. జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం అతలాకుతలమవుతోంది. ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్రలోనూ భారీగా వానలు పడుతుండటంతో జిల్లా సరిహద్దున ఉన్న పెన్ గంగా నదిలో వరద నీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. వాగులు ఉప్పొంగి పారడంతో లోలెవల్ వంతనలు మునిగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో జనాలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోనూ వానలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. రోజువారి వ్యవసాయ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. కాగా నిర్మల్ జిల్లా జలదిగ్భందమైంది. నిర్మల్ జిల్లాలో భైంసా డివిజన్ పరిధిలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గాను అదే విధంగా మహారాష్ట్ర లో కురుస్తున్న వర్షాలకు గాను భైంసా లోని గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తివేసి 34వేల 800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు .

    అలాగే తానూర్ మండలంలో కూడా పలు వాగులు వంతెనపై నుండి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు వెళ్లే ప్రజలు ప్రయాణానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక వైపు రైతన్నలు కురుస్తున్న వర్షాలకు విత్తనాలు పెట్టె సమయంలో పడ్డ వర్షాలకు సంతోషంగా ఉన్న మరో వైపు ఎడతెరుపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గాను పంటలకి ఇబ్బందులు వస్తాయో ఏమో అని తెలియని పరిస్థితి నెలకొంది. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ పరిధిలోని భైంసా మండలంలోని పల్సికర్ రంగారావు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతున్న క్రమంలో ముంపు గ్రామమైన గుండేగమ్ గ్రామములో ఇండ్లలో నీరు చేరాయి. అదే నీటి ప్రవాహం రోడ్డు పైకి రాగ ,పలు చుట్టు పక్కల గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా గుండేగం గ్రామానికి ప్రతి వర్ష కాలంలో ఇవ్వే ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. గత ఏడాది కూడా ఇలాగే వర్షం నీరు తమ గ్రామంలోకి, తమ ఇంట్లో కి రాత్రి వేళల్లో రావడంతో చాలా ఇబ్బందులు ఎదురుకొన్నామని ఇప్పటికైనా తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అటు మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను పైకెత్తి దిగువకు వదులుతున్నారు. మొత్తంమీద ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ భారీ వర్షం ఉమ్మడి జిల్లా వాసులను అతలాకుతలం చేస్తోంది.

    ఆదిలాబాద్ - నిజామాబాద్ జిల్లాల్లో..
    కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లు వరద ముంపుతో అలాడుతున్నాయి. ముఖ్యంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి ఎక్కువగా పెరిగిపోతోంది. దీంతో రాష్ట్ర సర్కార్ అలెర్ట్ అయింది. వెంటనే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని వరద ప్రాంతాల్లోని కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అధికారులు , ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అక్కడ సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సూచించారు. ఇప్పటికే నిర్మల్ పట్టణం నీట మునిగినందున వెంటనే అక్కడికి NDRF బృందాలను పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్‌‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ప్రాజెక్టులోకి భారీగా వస్తున్న వరద నీరు.. దీంతో శ్రీరామ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 90% నిండినది. ఏ సమయంలోనైనా ప్రాజెక్టు గేట్లు తెరిచి అవకాశం ఉన్నదని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.. అయితే గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.. గోదావరి నది పరివాహక గ్రామాలలోని ప్రజలను అప్రమత్తం చేయాలని. ముఖ్యంగా గొర్ల ,బర్ల కాపరులు, చేపల వేటకు పోయే వారు నది లోనికి వెళ్లకుండా రెవెన్యూ శాఖ మరియు పోలీసు శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీనివాస్ కోరారు.

    నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం పోచంపాడు గ్రామంలోని ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తుంది.. ప్రాజెక్టు ఎగువ భాగంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి నీటి వరద పోటెత్తింది.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగుల గాను 1089.20 అడుగులకు చేరుకుంది. ఇదిలా ఉండగా ఎడతెరపి లేని వర్షాల కారణంగా నిర్మల్ పట్టణం మొత్తం నీట మునిగినందున వెంటనే అక్కడికి NDRF బృందాలను పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్‌‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులంతా ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు.
    Published by:Veera Babu
    First published: