మరో గంట ఈ ప్రాంతాల్లో వర్ష బీభత్సమే.. జీహెచ్‌ఎంసీ హెచ్చరిక..

Hyderabad Rains: వర్ష బీభత్సంపై హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) స్పందించింది. వరుణుడు విజృంభిస్తుండటంతో నగర వాసులు ఇళ్లు విడిచి బయటకు రావొద్దని హెచ్చరించింది. ఇప్పటికే వర్షం భారీగా కురవగా మరో గంట పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుందని అధికారులు హెచ్చరించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 25, 2019, 6:47 PM IST
మరో గంట ఈ ప్రాంతాల్లో వర్ష బీభత్సమే.. జీహెచ్‌ఎంసీ హెచ్చరిక..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మంగళవారం నగరవాసులను బెంబేలెత్తించిన వాన.. ఈ రోజు కూడా తన ప్రతాపాన్ని చూపించింది. ఎక్కడ చూసినా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఉద్యోగులు తమ విధిని ముగించుకొని ఇంటికి పయనమయ్యే సమయానికే కుండపోత వర్షం కురవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వర్ష బీభత్సంపై హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) స్పందించింది. వరుణుడు విజృంభిస్తుండటంతో నగర వాసులు ఇళ్లు విడిచి బయటకు రావొద్దని హెచ్చరించింది. ఇప్పటికే వర్షం భారీగా కురవగా మరో గంట పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుందని అధికారులు హెచ్చరించారు.

వర్షంపై జీహెచ్‌ఎంసీ రిపోర్టు


జీహెచ్‌ఎంసీ పరిధిలోని పటాన్‌చెరులో మరో గంటలో వర్షం 6 సెంటీమీటర్లకు పైగా కురుస్తుందని తెలిపారు. హైటెక్ సిటీ, కూకట్ పల్లి, ఖైరతాబాద్, చార్మినార్, రాజేంద్ర నగర్, అబిడ్స్, కోఠి, కుత్బుల్లాపూర్‌మెట్, సికింద్రాబాద్, ఓయూ ప్రాంతాల్లో జోరు వాన కురుస్తుందని వెల్లడించారు. అంతేకాక.. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, కంటోన్మెంట్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు పడతాయని స్పష్టం చేశారు.


కాగా, నిన్నసాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతలన్నీ నీట మునిగాయి. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇంటికి వెళ్లేవాళ్లకు చుక్కలు కనిపించాయి. వాన ఎప్పటికీ తగ్గకపోవడంతో చాలామంది తడుస్తూనే... ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే గత వందేళ్లలో ఏనాడు ఈ విధంగా వర్షం పడలేదు.

దాదాపు 111 ఏళ్ల తర్వాత సెప్టెంబర్‌లో ఈ విధంగా కుండపోత వర్షం కురిసింది.1908 సెప్టెంబరు తర్వాత ఈస్థాయిలో వాన కురవడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి నాలాలు, చెరువులు పొంగిపోర్లాయి. రోడ్లపై మోకాళ్ల నీతు చేరింది. దీంతో వాహనదారులకు కూడా తిప్పలు తప్పలేదు. . రాత్రి 11 గంటల వరకు సికింద్రాబాద్‌ తిరుమలగిరిలో అత్యధికంగా 12.1, ఉప్పల్‌లో 12 సెం.మీల వర్షం కురిసింది.  1908లో సెప్టెంబరు 27న ఒకేరోజు హైదరాబాద్‌లో 15.3 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సెప్టెంబర్ 24న ఆ స్థాయిలో వర్షం కురిసిందని భాగ్యనగర వాసులు చర్చించుకుంటున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: September 25, 2019, 6:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading