హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. జీహెచ్‌ఎంసీ రెస్క్యూ టీమ్స్ శెభాష్..

Hyderabad Rains: ఈ రోజు మధ్యాహ్నం ఆకస్మిక వర్షం పడుతుందని వాతావరణ శాఖ ముందస్తు సమాచారం ఇవ్వడంతో ఇంజ‌నీరింగ్ మాన్సూన్ బృందాలు, అర్బన్ బ‌యోడైవ‌ర్సిటీ, ఎమ‌ర్జెన్సీ రెస్క్యూ బృందాల‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ అప్రమత్తం చేశారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 16, 2019, 5:30 PM IST
హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. జీహెచ్‌ఎంసీ రెస్క్యూ టీమ్స్ శెభాష్..
రాజ్‌భవన్ రూట్‌లో వాన నీటిని తొలగిస్తున్న జీఎచ్‌ఎంసీ సిబ్బంది
  • Share this:
అప్పటి దాకా జోరు ఎండ.. హైదరాబాద్ వాసులు ఉక్కపోతతో అల్లాడిపోయారు.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చూస్తుండగానే క్షణాల్లో ఎండ మాయమైంది.. అప్పుడే చీకటి పడిందా అన్నట్లు కారు మబ్బులు కమ్ముకున్నాయి.. ఇంకేముంది, వాన ముంచెత్తింది. ఇలా వచ్చి అలా వెళ్లింది గానీ, కుండతో ఒక్కసారిగా నీళ్లు కుమ్మరించినట్లు నగరాన్ని నీళ్లమయం చేసేసింది. అయితే, సకాలంలో స్పందించిన జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు ట్రాఫిక్‌‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం ఆకస్మిక వర్షం పడుతుందని వాతావరణ శాఖ ముందస్తు సమాచారం ఇవ్వడంతో ఇంజ‌నీరింగ్ మాన్సూన్ బృందాలు, అర్బన్ బ‌యోడైవ‌ర్సిటీ, ఎమ‌ర్జెన్సీ రెస్క్యూ బృందాల‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ అప్రమత్తం చేశారు.

వాన నీటిని తొలగిస్తున్న సిబ్బంది


దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది.. వర్షం పడుతుండగానే నగరంలోని దాదాపు 50 ప్రాంతాల్లో నీళ్లు నిల్వ కాకుండా చర్యలు తీసుకొని, ట్రాఫిక్‌‌కు ఇబ్బందులు ఎదురవకుండా చూశారు. ముఖ్యంగా రాజ్‌భ‌వ‌న్ రోడ్, అసెంబ్లీ, హిమ‌య‌త్‌న‌గ‌ర్‌, మాదాపూర్‌, బంజారాహిల్స్‌, అంబ‌ర్‌పేట్‌, ఐఎస్ స‌ద‌న్‌, యాక‌త్‌పుర‌, టోలీచౌకి, షేక్‌పేట్‌, అమీర్‌పేట్‌, శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీ, ఎల్బీన‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ర‌హ‌దారుల‌పై వాననీటిని తొలగించారు. దీంతో పాటు జీహెచ్ఎంసీ క‌మాండ్ కంట్రోల్ రూం నుండి న‌గ‌రంలో వాట‌ర్ లాగింగ్ ఏరియాల‌ను గుర్తించి స‌మీపంలోని మాన్సూన్ బృందాల‌కు స‌మాచారం అందించ‌డంతో వెంట‌నే పరిష్కార మార్గాలు వెతికి చర్యలు తీసుకోని నగరవాసులకు ఇబ్బంది లేకుండా చేశారు.

First published: July 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు