హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : అప్పుడే 40 డిగ్రీలు దాటేసింది.. రాబోయే రోజులు అగ్నిగుండమే.. IMD ఆరెంజ్ అలర్ట్ జారీ

Telangana : అప్పుడే 40 డిగ్రీలు దాటేసింది.. రాబోయే రోజులు అగ్నిగుండమే.. IMD ఆరెంజ్ అలర్ట్ జారీ

తెలంగాణలో ఎండలు దంచుతున్నాయి. ఇప్పటికే నాటికే 40 డిగ్రీలపైబడి ఉష్ణోగ్రత నమోదైంది. ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రోజుల్లో ఎండ అగ్నిగుండాన్ని తలపించడం ఖాయంగా కనిపిస్తోంది..

  వేసవి ప్రారంభ దశలోనే తెలంగాణలో ఎండలు దంచుతున్నాయి. ఇప్పటికే నాటికే 40 డిగ్రీలపైబడి ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వేవి విపరీతంగా పెరుగుతోన్న దరిమిలా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ విభాగం(ఐఎండీ).

  తెలంగాణలో ఉష్ణోగ్రలు పెరుగుతోన్న దరిమిలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వడదెబ్బల బారినపడే అవకాశం ఉందంటూ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలోని బజార్‌ హత్నూర్‌లో 20 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.

  CM KCR.. మానవత్వం లేదా? బోయిగూడ మృతులకు రూ.5లక్షలేనా? : వీహెచ్ ఫైర్ -షాకింగ్ నిజాలు

  అప్పుడే ఏప్రిల్‌ మాసం వచ్చిందా? అన్నట్టు భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. ఉదయం 8 గంటలకే వడ గాలులు ఆరంభమవుతున్నాయి. మధ్యాహ్నం 12 అయిందంటే చాలు వేడి మరింత పెరిగిపోతోంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల నుంచే భానుడు ఉగ్రరూపం దాల్చుతుండడంతో అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు వెళ్లాలంటేనే బెంబేలెత్తుతున్నారు. 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిలకడగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగడంతో రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరేస్థాయికి చేరుకుంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

  CM KCR: బోయిగూడలో భారీ అగ్నిప్రమాదం.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు. 11 మృతదేహాలకు పోస్టుమార్టం తర్వాత..

  కాగా, చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిన కారణంగా మంగళవారం రాష్ట్రంలోని పలుచోట్ల స్వల్పంగా వర్షాలు కురిశాయి. వనపర్తి జిల్లా మిరాస్‌పల్లిలో అత్యధికంగా 1.3, పెబ్బేరులో 1.1, మహబూబ్‌నగర్‌లోని పర్పల్లిలో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

  First published:

  Tags: Heat wave, IMD, Summer, Telangana, WEATHER, Weather report

  ఉత్తమ కథలు