హోమ్ /వార్తలు /తెలంగాణ /

హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..

హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరవడంతో స్థానికులకు అనుమానం కలిగింది. కాస్త ధైర్యం చేసి ఆ అట్టపెట్టె వద్దకు వచ్చి, దాన్ని ఓపెన్ చేసి చూశారు. అంతే, దాంట్లో కనిపించిన దృశ్యాన్ని చూసి షాకయ్యారు.

హైదరాబాద్ లో రద్దీగా ఉండే ప్రాంతం. ఆ ప్రాంతంలో చెత్తకుప్పకు కాస్త దగ్గరలో ఓ అట్టపెట్టె కనిపించింది. ఆ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరవడంతో స్థానికులకు అనుమానం కలిగింది. కాస్త ధైర్యం చేసి ఆ అట్టపెట్టె వద్దకు వచ్చి, దాన్ని ఓపెన్ చేసి చూశారు. అంతే, దాంట్లో కనిపించిన దృశ్యాన్ని చూసి షాకయ్యారు. అయ్యో పాపం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి, ఆ అట్టపెట్టెను స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఎవరు? ఎప్పుడు? ఇక్కడ పడేశారన్న దానిపై వివరాలు సేకరించడం మొదలు పెట్టారు. దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలించడం స్టార్ట్ చేశారు. ఇంతకీ ఆ అట్టపెట్టెలో ఏముందనే కదా మీ డౌటు. అప్పుడే పుట్టిన ఓ పసిబిడ్డ మృతదేహం అందులో ఉంది. హైదరాబాద్ లో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ లోని బాలాపూర్ డీఆర్ డీఎల్ శివాజీ చౌక్ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంటుంది. బుధవారం స్థానికులకు రోడ్డు పక్కన ఓ అట్టపెట్టె కనిపించింది. దాని చుట్టూ కుక్కలు చేరి అరుస్తుండటంతో స్థానికులకు అనుమానం కలిగింది. కొందరు వ్యక్తులు ధైర్యం చేసి ఆ అట్టపెట్టెను ఓపెన్ చేశారు. అందులో మగబిడ్డ మృతదేహం ఉంది. ఓ వస్త్రంలో బిడ్డను చుట్టి అట్టపెట్టెలో ప్యాక్ చేసి మరీ రోడ్డు పక్కన పడేశారు. అప్పుడే పుట్టిన పసిబిడ్డలా ఉందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి: చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..

పోలీసులు వచ్చి ఆ అట్టపెట్టెను, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచారు. కాగా, బిడ్డను అట్టపెట్టెలో వేసి రోడ్డు పక్కన పెట్టిన తర్వాత మృతిచెందాడా? లేక చనిపోయిన తర్వాతే ఇక్కడకు తీసుకొచ్చి పడేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో రోడ్డు పక్కన ఆ అట్టపెట్టెను వదిలేసి వెళ్లపోయిందెవరన్నది కూడా పోలీసులు విచారణ ప్రారంభించారు. దగ్గరలో ఉన్న సీసీ కెమెరా రికార్డులను పరిశీలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!

First published:

Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Hyderabad, Wife kill husband

ఉత్తమ కథలు