హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: పోలీస్ కొలువు కొట్టాలనుకున్నాడు..కానీ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తుండగా గుండెపోటు..ఎస్సై అభ్యర్థి మృతి

Telangana: పోలీస్ కొలువు కొట్టాలనుకున్నాడు..కానీ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తుండగా గుండెపోటు..ఎస్సై అభ్యర్థి మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆ యువకుడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని కలలు కన్నాడు. అందులో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే, నేరాలను అరికట్టే పోలీసు శాఖలో కొలువు కోసం నిరంతరం శ్రమించాడు. మొన్న జరిగిన ప్రిలిమ్స్ పరీక్ష (Prelims Exam)లో ఎస్సై అభ్యర్థిగా క్వాలిఫై అయ్యాడు. ఇక ఈవెంట్స్ లోను రాణించి మెయిన్ ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు. కానీ అతని ఆశలను విధి వక్రీకరించింది. ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా..గుండెపోటు రావడంతో ఆ యువకుడు మృతి చెందాడు. తెలంగాణలో (Telangana)ని సూర్యాపేట (Suryapeta)లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఆ యువకుడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని కలలు కన్నాడు. అందులో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే, నేరాలను అరికట్టే పోలీసు శాఖలో కొలువు కోసం నిరంతరం శ్రమించాడు. మొన్న జరిగిన ప్రిలిమ్స్ పరీక్ష (Prelims Exam)లో ఎస్సై అభ్యర్థిగా క్వాలిఫై అయ్యాడు. ఇక ఈవెంట్స్ లోను రాణించి మెయిన్ ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు. కానీ అతని ఆశలను విధి వక్రీకరించింది. ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా..గుండెపోటు రావడంతో ఆ యువకుడు మృతి చెందాడు. తెలంగాణలో (Telangana)ని సూర్యాపేట (Suryapeta)లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

Good News: తాజ్‌మహల్‌తో పాటు పురాతన కట్టడాలను ఉచితంగా సందర్శించే ఛాన్స్ .. వివరాలు ఇవిగో ..

సూర్యాపేట (Suryapeta) పట్టణ కేంద్రంలోని ఇందిరమ్మ కాలనిలో సమర్తపు లక్ష్మయ్య (Sammarapu Lakshmaiah) తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. లక్ష్మయ్య కుమారుడు శ్రీకాంత్  (Srikanth)  పోలీస్ జాబ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (Telangana state police recruitment Board) కొన్ని నెలల కిందట ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. శ్రీకాంత్ (Srikanth) ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష పాస్ అయ్యాడు. ఆ తరువాత వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం లక్ష్మయ్య సన్నద్ధం అవుతున్నాడు. ప్రతీ రోజు గ్రౌండ్ కు వెళ్లి రన్నింగ్ (Running), లాంగ్ జంప్ (Long Jump), హై జంప్, పుషింగ్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. రోజులాగే నిన్న కూడా పట్టణంలోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాల (Venkateshwara Degree College)కు వెళ్లి ప్రాక్టీస్ చేస్తుండగా హఠాత్తుగా ఒక్కసారి గ్రౌండ్ లో కుప్పకూలిపోయాడు. అతనిని గమనించిన తోటి మిత్రులు  శ్రీకాంత్  (Srikanth) ను ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి శ్రీకాంత్  (Srikanth)  అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు.

తమ కొడుకు మరికొన్ని రోజుల్లో పోలీస్ జాబ్ కొట్టి ఆనందంగా ఉంటాడనుకున్న తల్లిదండ్రులు శ్రీకాంత్  (Srikanth)  విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి బోరున విలపించారు. మంచి ప్రయోజకుడిగా అయ్యి తమ పేరును నిలబడతాడనుకున్న కొడుకు మృతదేహాన్ని చూసిన ఆ తల్లి గుండెలు అవిసేలా విలపించింది. ఏ జాబ్ కొట్టి ఉన్నతంగా ఉండాలనుకున్నాడో అదే జాబ్ వల్ల  ప్రాణం పోయిందని వారు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీకాంత్  (Srikanth) అకాల మరణంతో స్థానికంగా విషాధచాయలు అలముకున్నాయి. కాగా ప్రస్తుత రోజుల్లో చిన్న వయసు నుంచే గుండిపోటు రావడం అధికం అయిపోయింది.

First published:

Tags: Suryapet, Telangana