తల్లి సర్పంచ్.. కొడుకు పెత్తనం.. పైగా న్యూస్ రిపోర్టర్ పేరుతో వసూళ్లు..

అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న యువకులు

ఇటుకబట్టీ తయారీ కోసం చెరువులో నుంచి మట్టి తవ్వుకునేందుకు అన్ని అనుమతులు ఉన్నా.. స్థానిక రాజకీయ నాయకుల అండతో గ్రామపంచాయతీ సర్పంచ్ కుమారుడు రూ.50వేలు, యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ రూ.50 డిమాండ్ చేశారు.

  • Share this:
    గ్రామస్తులంతా ఓ మహిళను నమ్మి సర్పంచ్‌గా గెలిపించారు. కానీ ఆ మహిళ సర్పంచ్ కొడుకు తన తల్లిని పక్కనబెట్టి తానూ పెత్తనం చేలాయిస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఓ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్‌గా చలామణి అవుతున్న మరో వ్యక్తితో కలిసి వసూళ్లకు పాల్పడుతున్న ఘటన కరీంనగర్ జిల్లా బెజ్జంకి నరసింహుల పల్లె గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ఇటుకబట్టీ తయారీ కోసం చెరువులో నుంచి మట్టి తవ్వుకునేందుకు అన్ని అనుమతులు ఉన్నా.. స్థానిక రాజకీయ నాయకుల అండతో గ్రామపంచాయతీ సర్పంచ్ కుమారుడు రూ.50వేలు, యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ రూ.50 డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితుడు పెద్దోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇటుక తయారీ కోసం నరసింహుల పల్లె గ్రామపంచాయతీ పరిధిలోని జంగాల చెరువులో నుంచి 800 క్యూబిక్ మీటర్ల మట్టిని తీసుకునేందుకు అనుమతులు తీసుకున్నానని తెలిపారు.

    సంబంధిత మండలంలోని అధికారులకు పర్మిషన్ లెటర్ ఇచ్చి చెరువులో పని చేసుకోవడానికి అనుమతి పొందానని చెప్పారు. అయినా చెరువు నరసింహుల పల్లె నూతన గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నందున గ్రామనికి ఒక ట్రిప్‌నకు 50 రూపాయల చొప్పున గ్రామ పంచాయతీకి ఇస్తానని ఒప్పుకున్నానని వివరించాడు. కానీ సంపత్, జెట్టి మహేష్ అనే ఇరువురు వ్యక్తులు కలిసి రూ.లక్ష ఇవ్వాలని, లేనిపక్షంలో ట్రాక్టర్లు నడవకుండా ఆపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
    Published by:Narsimha Badhini
    First published: