అసలు వైద్య సిబ్బందికి కరోనా ఏలా వచ్చింది?.. వారికి రక్షణ కిట్లు ఇచ్చారా అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన పలు అంశాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకిందన్న విషయాన్ని కోర్టుకు వివరించారు. వైద్యులకు రక్షణ కిట్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. అసలు వైద్య సిబ్బందికి కరోనా ఏలా వచ్చిందో ఈనెల 8వ తేదీలోపు సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా నిమ్స్, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌లో పలువురు వైద్య విద్యార్థులతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది సైతం కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి విదితమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, High Court, Telangana