Home /News /telangana /

Fake jobs: వీఆర్ఓ, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలంటూ మోసం.. సొంత అక్క, బావ నుంచే డబ్బులు వసూలు..

Fake jobs: వీఆర్ఓ, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలంటూ మోసం.. సొంత అక్క, బావ నుంచే డబ్బులు వసూలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Fake jobs: అమాయక ప్రజలను ఆసరాగా చేసుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసి ఓ యువకుడు లక్షలు కాజేశాడు. తమ బంధువే కదా అని నమ్మితే అసలుకే ఎసరు పెట్టిన ఉదంతం కరీంనగర్ జిల్లా లో చోటు చేసుకుంది.

  (పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)

  నిందితుడు ముద్దసాని అభిలాష్(26) ప్రైవేటు జాబు చేస్తున్నాడు. ఇతను కరీంనగర్ భాగ్య నగర్ లో ఉండేవాడు. ఇతను బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ 2016 లో చదువు పూర్తి చేసి, తర్వాత కత్రియ హోటల్, హైదరాబాద్ లోని ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్స్ గా పని చేస్తూ నెలకు రూ.12,000/- లకు జీతం తీసుకునేవాడు. వచ్చే ఆ జీతం సరిపోనందున ఇంకా అతని అవసరాలకు మరియు ఉన్నతంగా బతుకడానికి బాగా డబ్బులు సంపాదించాలని దుర్బుద్ధితో ఒక పథకాన్ని సిద్ధం చేశాడు. 2018 సంవత్సరంలో అతని పెద్దమ్మ కూతురైన గంధం మమత, మరియు ఈమె భర్త గంధం రాజన్న, మంచిర్యాల సి.సి. క్రాస్ రోడ్, నస్పూర్ లో ఉండేవారు. వీరు ఉద్యోగం లేక ఇంట్లోనే ఉంటున్నారు. ఇదే అదునుకగా భావించిన అభిలాష్ వాళ్ళ ఇంటికి వెళ్లి అతని అక్క కు , బావకు వి.ఆర్.వో. ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. తనకు తెలిసిన వారితో మాట్లాడి అందులో జాబ్ వచ్చే ఏర్పాటు చేస్తానని నమ్మించాడు. దానికి రూ. 20 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి వారికి మాయ మాటలు చెప్పి నమ్మించాడు. ఇతని మాటలు నమ్మి అతను చెప్పినట్టుగా రూ.19.60 లక్షలను అతడికి నగదు రూపంలో కొంత.. అతడి అకౌంట్ కి కొన్ని డబ్బులను ట్రాన్స్ ఫర్ చేశారు.

  తర్వాత ప్రొసీడింగ్స్ ఆఫ్ ద స్టీట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఇన్సురెన్సు తెలంగాణా, ప్రొసీడింగ్ నెం.E1/1105/2019 dt:13.05.2019 ప్రకారంగా వి.ఆర్.వో. ఉద్యోగానికి జాయినింగ్ డేట్ కు సంబధించిన నకిలీ డాక్యుమెంట్ తయారు చేసి దానిపై TSPSC చైర్మన్, తెలంగాణా రాష్ట్రం శ్రీ గంట చక్రపాణి సంతకాన్ని ఫోర్జరీ చేసి దానిని నిజమైనదిగా నమ్మించాడు. అట్టి ప్రోసీడింగ్ ను అతని బావ గంధం రాజన్న కు ఇచ్చి, తేది: 04.10.2019 రోజున ఇతని భావ రాజన్నకు మరియు అతని అక్క మమతకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీ సర్వరాజ్ అహ్మద్, IAS గారి సంతకం ఫోర్జరీ చేసి అతని భావ గంధం రాజన్న కు వి.ఆర్.వో. అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ మరియు ఇతని అక్క మమతకు L.D.C అప్పాయింట్మెంట్ ఆర్డర్స్ కాపీ డాకుమెంట్స్ ను ప్రిపేర్ చేసి వాటిని నిజమైనవిగా నమ్మించి వారికి ఇచ్చినాడు. అంతలో వీఆర్ఓ ఉద్యోగాలు రద్దు అయినాయని చెప్పి వాటికి బదులుగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించినాడు. కాని అతడి భావ గంధం రాజన్న వినలేదు.

  పోలీసుల అదుపులో నిందితుడు


  తాము ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని అడగడంతో 2020 మార్చి 3 వ తారీఖున ఓప్పందం రాసుకున్నారు. 2020 మార్చి 30 లోగా డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పాడు. ఎన్ని రోజులు ఆగినా డబ్బలు తిరిగి ఇవ్వలేదు. మళ్లీ తన బావ పేరుపై జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం అపాయింట్ మెంట్ ఆర్టర్ కాపీని తయారు చేసి దానిపై గంగాధర మండల రెవిన్యూ ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, అలాగే ఇతని అక్క మమత కు కూడా అలాంటి డుప్లికేట్ అపాయింట్ మెంట్ ఆర్డర్ ను తయారు చేశాడు. వాళ్ల అక్క అపాయింట్ మెంట్ ఆర్డర్ పై తిమ్మాపూర్ మండల రెవిన్యూ ఆఫీసర్, జిల్లా కరీంనగర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి వాటిని నిజమైనవిగా ఇచ్చినాడు. తీరా వాటిని పట్టుకొని వారు జాయిన్ అవ్వడానికి వెళ్లగా అవి నకిలీవి అని ఉన్నత అధికారుల గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు జరిగిన విషయాన్ని తెలపడంతో అభిలాష్ నేరం ఒప్పుకున్నాడు. అతడిని మంచిర్యాల పోలీసులు అదుపులో కి తీసుకోని విచారిస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల వలలో పడి అమాయక ప్రజలు మోసపోవద్దని ఇలాంటివి మీ దృష్టి కి వస్తే పోలీసులకు తెలియజేయాలన్నారు.

  మీ నగరం నుండి (కరీంనగర్)

  తెలంగాణ
  కరీంనగర్
  తెలంగాణ
  కరీంనగర్
  Published by:Veera Babu
  First published:

  Tags: Cheated, Fake jobs, Fake tspsc jobs, Karimnagar, Telangana government jobs, TSPSC

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు