ముగ్గురు యువతుల్ని చంపేశాడు... హాజీపూర్‌లో ఉద్రిక్తత... నిందితుడు శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడి...

Hazipur Serial Murders : యాదాద్రి భువనగిరి జిల్లా... బొమ్మలరామారం మండలం... హాజీపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ముగ్గురు బాలికల హత్య కేసులో నిందితుడైన శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై గ్రామస్థులు ఆగ్రహాంతో దాడి చేశారు. ఇంటిని తగలబెట్టారు.

Krishna Kumar N | news18-telugu
Updated: April 30, 2019, 10:24 AM IST
ముగ్గురు యువతుల్ని చంపేశాడు... హాజీపూర్‌లో ఉద్రిక్తత... నిందితుడు శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడి...
నిందితుడు శ్రీనివాస్ రెడ్డి
  • Share this:
యాదాద్రి భువనగిరి జిల్లా... బొమ్మలరామారం మండలం... హాజీపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముగ్గురు బాలికల్ని చంపేశాడని భావిస్తున్న నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఊరి ప్రజలు... ఆ ఇంటిని తగలబెట్టారు. ఆసలే ఎండా కాలం కావడంతో... ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. క్షణాల్లో ఇల్లు మొత్తం మంటలు అంటున్నాయి. స్థానికులు ఇంత ఆగ్రహంతో రగిలిపోతుండటానికి కారణం శ్రీనివాస రెడ్డి చేసిన దుర్మార్గాలేనని తెలుస్తోంది. హాజీపూర్-మైసిరెడ్డి పల్లి దారిలో ఉన్న ఆ బావిలో చాలా మంది యువతుల మృతదేహాలు ఉండి ఉండొచ్చని తెలుస్తోంది. చుట్టుపక్కల గ్రామాల్లో కొన్నేళ్లుగా చాలామంది యువతులు కనిపించకుండా పోతున్నారు. వాళ్లందర్నీ శ్రీనివాస రెడ్డే చంపేసి... ఆ బావిలో పడేసి ఉంటాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్‌లో శ్రావణి, మనీషాల వరుస హత్యల మిస్టరీ వీడింది. ఏసీ మెకానిక్ అయిన శ్రీనివాస రెడ్డి ఈ హత్యలు చేసినట్లు పోలీసులు తేల్చారు. రేప్ చేసి, ఆపై వాళ్లను హత్య చేసినట్టు గుర్తించారు. ఇదే హాజీపూర్‌లో కల్పన అనే బాలిక నాలుగేళ్ల కిందట అదృశ్యమైంది. ఆంధ్రా ఫాంహౌజ్‌లో మరో మహిళ కనిపించట్లేదు. వీళ్ల అదృశ్యం వెనుక కూడా శ్రీనివాసరెడ్డి హస్తం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

హాజీపూర్ గ్రామానికి బస్సు సర్వీసులు లేవని... గ్రామస్తులు చాలామందికి లిఫ్ట్ అడిగి వెళ్లడం అలవాటు. దీన్నే ఆసరాగా చేసుకుని శ్రీనివాసరెడ్డి యువతులపై అత్యాచారాలు, హత్యలు చేసినట్టు చెబుతున్నారు. మనీషా, శ్రావణిలకు కూడా అలాగే లిఫ్ట్ ఇచ్చిన శ్రీనివాస రెడ్డి.. వారికి నమ్మకం కలిగించేలా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అదును చూసి వేర్వేరు సందర్భాల్లో ఇద్దర్నీ రేప్ చేసి, చంపేశాడని సమాచారం.

శ్రావణి మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు... హాజీపూర్-మైసిరెడ్డి పల్లి దారిలో 60 అడుగుల లోతులో ఉన్న ఓ బావిలో మొదట ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అదే బావిలో మనీషా అనే యువతి మృతదేహం కూడా కనిపించింది. బావిలో లభించిన కాలేజీ బ్యాగ్... అందులో ఉన్న సర్టిఫికెట్స్ ఆధారంగా మృతదేహం మనీషాదిగా గుర్తించారు.

మనీషా(18) కీసరలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. రెండు నెలల కిందట ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లిన ఆమె మళ్లీ తిరిగిరాలేదు. మనీషా ఎవరైనా అబ్బాయితో పారిపోయి ఉంటుందని భావించిన కుటుంబ సభ్యులు... పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందన్న భయంతో ఆ పనిచేయలేదు. ఆమె మృతదేహం బయటపడేదాకా.. ఆమెను చంపేశారన్న విషయం తెలియలేదు.

హాజీపూర్-మైసిరెడ్డి పల్లి దారిలో ఉన్న ఆ బావిలో ఇంకెంతమంది యువతుల మృతదేహాలు ఉన్నాయోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లోనూ గత కొన్నేళ్లలో చాలామంది యువతులు అదృశ్యమయ్యారు. ఆ ఘటనల వెనుక కూడా శ్రీనివాసరెడ్డే ఉన్నాడా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

 ఇవి కూడా చదవండి :

వీవీప్యాట్ స్లిప్పులను ఇలా లెక్కించాలి... రూల్స్ ఏంటో చెప్పిన ఈసీ...

స్టూడెంట్స్ బీ రెడీ... మే రెండో వారంలో ఏపీ టెన్త్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్...

టీడీపీకి షాక్... వైసీపీ ఖాతాలోకి గోదావరి జిల్లాలు... కొత్త సర్వేలో ఆసక్తికర అంశాలు...

ఉత్తరాంధ్రలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ... ప్రభావం చూపిస్తున్న జనసేన...
First published: April 30, 2019, 10:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading