వీడిన హాజీపూర్ వరుస హత్యల మిస్టరీ.. వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు

హాజీపూర్-మైసిరెడ్డి పల్లి దారిలో ఉన్న ఆ బావిలో ఇంకెంతమంది యువతుల మృతదేహాలు ఉన్నాయన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లోనూ గత కొన్నేళ్లలో చాలామంది యువతులు అదృశ్యమయ్యారని.. ఆ ఘటనల వెనుక కూడా శ్రీనివాసరెడ్డే ఉన్నాడా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

news18-telugu
Updated: April 30, 2019, 9:20 AM IST
వీడిన హాజీపూర్ వరుస హత్యల మిస్టరీ.. వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు
హాజీపూర్ హత్యకేసుల్లో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి
  • Share this:
యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్‌లో శ్రావణి, మనీషాల వరుస హత్యల మిస్టరీ వీడింది. శ్రీనివాస రెడ్డి అనే ఓ ఏసీ మెకానిక్ ఈ హత్యలకు పాల్పడినట్టు పోలీసులు నిర్దారించారు. అత్యాచారం జరిపి, ఆపై వారిని హత్య చేసినట్టు గుర్తించారు. ఇదే హాజీపూర్‌లో కల్పన అనే బాలిక నాలుగేళ్ల క్రితం అదృశ్యమైంది.. ఆంధ్రా ఫాంహౌజ్‌లో మరో మహిళ అదృశ్యమైంది.. వీరి అదృశ్యం వెనుక కూడా శ్రీనివాసరెడ్డి హస్తం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

హాజీపూర్ గ్రామానికి బస్సు సర్వీసులు లేవని.. గ్రామస్తులు చాలామందికి లిఫ్ట్ అడిగి వెళ్లడం అలవాటని స్థానికులు చెబుతున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని శ్రీనివాసరెడ్డి యువతులపై అత్యాచారాలు, హత్యలు చేసినట్టు చెబుతున్నారు. మనీషా, శ్రావణిలకు కూడా అలాగే లిఫ్ట్ ఇచ్చిన శ్రీనివాస రెడ్డి.. వారికి నమ్మకం కలిగించేలా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అదును చూసి వేర్వేరు సందర్భాల్లో ఇద్దరిపై అత్యాచారం, హత్య చేసినట్టు సమాచారం.

శ్రావణి మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. హాజీపూర్-మైసిరెడ్డి పల్లి దారిలో 60 అడుగుల లోతులో ఉన్న ఓ బావిలో మొదట ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అదే బావిలో మనీషా అనే యువతి మృతదేహం కూడా లభ్యమైంది. బావిలో లభించిన కాలేజీ బ్యాగ్.. అందులో ఉన్న సర్టిఫికెట్స్ ఆధారంగా మృతదేహం మనీషాదిగా గుర్తించారు.మనీషా(18) కీసరలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోందని.. రెండు నెలల క్రితం ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లిన ఆమె మళ్లీ తిరిగిరాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మనీషా ఎవరైనా అబ్బాయితో పారిపోయి ఉంటుందని భావించిన కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందన్న భయంతో ఆ పనిచేయలేదు. దీంతో మనీషా మృతదేహం బయటపడేదాకా.. ఆమె హత్యకు గురైందన్న విషయం తెలియలేదు.


హాజీపూర్-మైసిరెడ్డి పల్లి దారిలో ఉన్న ఆ బావిలో ఇంకెంతమంది యువతుల మృతదేహాలు ఉన్నాయన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లోనూ గత కొన్నేళ్లలో చాలామంది యువతులు అదృశ్యమయ్యారని.. ఆ ఘటనల వెనుక కూడా శ్రీనివాసరెడ్డే ఉన్నాడా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
First published: April 30, 2019, 8:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading