వాకింగ్ సమయంలో యువకుల బైక్ విన్యాసాలు.. భయాందోళనలో వాకర్స్..

ప్రతీకాత్మక చిత్రం

ఉప్పల్‌లో మార్నింగ్ వాక్ చేసే సమయంలో కొంత మంది యువకులు బైక్ స్టంట్స్ చేస్తూ వాకింగ్ కోసం వచ్చే వాకర్స్‌ను బెంబేలెత్తిస్తున్నారు. ప్రశాంతంగా వాకింగ్ చేసుకుందామని వచ్చేవారి ముందు స్టంట్స్ చేస్తుండడం వల్ల వారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

  • Share this:
    రోజురోజూకీ యువత వాడే ద్విచక్ర వాహనాల పట్ల మోజు పెరుగుతోంది. రోడ్లపై రయ్యిమంటూ దూసుకుపోయేందుకు ఇష్టపడుతున్నారు. అందులో భాగంగానే మార్కెట్‌లోకి వచ్చే నయా ట్రెండ్ బైకులను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. ఇక అక్కడి నుంచి రద్దీ తక్కువగా ఉండే రోడ్లపై బైక్ స్టంట్స్ చేస్తూ వినూత్న ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఉప్పల్‌లో మార్నింగ్ వాక్ చేసే సమయంలో కొంత మంది యువకులు బైక్ స్టంట్స్ చేస్తూ వాకింగ్ కోసం వచ్చే వాకర్స్‌ను బెంబేలెత్తిస్తున్నారు. ప్రశాంతంగా వాకింగ్ చేసుకుందామని వచ్చేవారి ముందు స్టంట్స్ చేస్తుండడం వల్ల వారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో వాకర్స్ తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

    ఉప్పల్‌లో మార్నింగ్ వాకింగ్‌కు వచ్చే వారి కోసం కొంతమంది యువకులను అరెస్టు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్‌తో వారి ప్రాణాలతోనే చెలగాటం ఆడడం కాకుండా వాకర్స్‌ను ప్రాణాప్రాయ స్థితిలోకి నెట్టిపడేస్తున్నారు. ఇప్పటికైనా వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
    Published by:Narsimha Badhini
    First published: