Home /News /telangana /

HAS TRS CHIEF CM KCR CHANGED THE STRATEGY IN POLITICS VRY KNR

Karimnagar : సీఎం కేసీఆర్ రూటు మార్చాడా... ? పార్టీ వీడిన సర్దార్‌ను చేర్చుకోవడంలో ఆంతర్యం ఏమిటీ...?

Ravinder sing met cm kcr

Ravinder sing met cm kcr

Karimnagar : టీఆర్ఎస్ చరిత్రలో లేనట్టుగా పార్టీని వీడిన ఓ నేతను తిరిగి సీఎం కేసీఆర్ ఆహ్వానించడం వెనక ఆంతర్యం ఏమిటీ.. రానున్న రోజుల్లో పార్టీ అధినేత ఇదే స్ట్రాటజీని ఫాలో కానున్నారా.. ;పార్టీ వీడిన ఉద్యమకారులను తిరిగి అక్కున చేర్చుకునేందుకు సీఎం సిద్దమయ్యారా... ?

ఇంకా చదవండి ...
  ( కరీంనగర్ జిల్లా..1.న్యూస్ 18తెలుగు కరస్పాండెంట్ శ్రీనివాస్. పి )

  రాజకీయాల్లో శాశ్వత శత్రువులు .. మిత్రులు ఉండరన్న నానుడి మరోసారి రుజువైంది . కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో తిరుగుబాటు బావుటా ఎగరేసిన మాజీ మేయర్ రవీందర్సింగ్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నెల రోజుల్లోనే తిరిగి పార్టీతో కలవడమే ఇందుకు నిదర్శనం . ఎన్నికల ప్రచారం సందర్భంగా గులాబీ పార్టీపై మాటల కత్తులు దూసిన సింగ్ .. పార్టీకి రాజీనామా చేసిన నెల రోజులకే పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ పంచన చేరారు . కండువా మారక ముందే వీడిన సొంతగూటికి చేరారు .

  గురువారం ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్టీ అధినేత , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి మీ వెంటే ఉంటానంటూ పుష్పగుచ్ఛం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు .కాగా నవంబర్ 25 న సింగ్ రాజీనామా చేసిన నాటి నుంచే బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగిన ప్పటికీ .. అందుకు భిన్నంగా వ్యవహారం నడిచి .. జిల్లా నేతలతో కుస్తీ పడుతూనే అధినేతతో దోస్తీకి సిద్ధమైన సింగ్ టీఆర్ఎస్‌కే జైకొట్టారు . సరిగ్గా నెలరోజుల క్రితం కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.. .

  ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అధికార పార్టీ అభ్యర్థులకు , స్వతంత్ర అభ్యర్థి మాజీ మేయర్ రవీందర్ సింగ్‌కు మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ జరిగింది .అయితే.. అధికార పార్టీ రాజకీయ చతురత ముందు స్వతంత్ర అభ్యర్థి పాచికలు పారలేదు . కనీసం అభ్యర్థులు వారి కంటకనబడకుండా వ్యుహాలు రచించారు. మరోవైపు ఓటమి పాలైన రవీందర్ సింగ్ పై ఒక దశలో పార్టీ స్థానిక నేతలు ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు .దీంతో ఇరుపక్షాల మధ్య నెల రోజులపాటు మాటల యుద్ధం నడిచింది . ఒకరి అవినీతిపై ఒకరు ఆరోపణలు గుప్పించారు . దీంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది .

  Revanth reddy : తిక్కరేగితే.. జైలుభరోకు పిలుపునిస్తాము.. సీఎం తమాషాలు చేస్తున్నడు..


  ఇదిలా ఉంటే హుజురాబాద్ ఎన్నికల  తర్వాత రాష్ట్ర రాజకీయాలు అనేక పరిణామాలకు దారితీశాయి. హుజురాబాద్  ఉప ఎన్నికల్లో ఈటెల గెలవడంతో టిఆర్ఎస్ పార్టీ కొంచెం దూకుడు కూడా తగ్గిందని రాజకీయ వర్గాలలో గుసగుసలు వినబడుతున్నాయి. ఇక రవీందర్ సింగ్ మళ్ళీ టీఆర్ఎస్ లో చేరడం తో కెసిఆర్ ఒక్క అడుగు వెనక్కి వేసి రవీందర్ సింగ్ ను పార్టీ లో చేర్చుకోవడం లో కూడా ఏమైనా రాజకీయకోణమా..? లేక మరేదైనా ఉందా.. కెసిఆర్ 20ఏళ్ల రాజకీయ చరిత్ర లో పార్టీని వదిలి వెళ్లిన అలె నరేంద్ర నుండి మొన్నటి ఈటెల వరకు ఏ ఒక్కరిని కూడా వెనక్కు పిలిచి మాట్లాడిన దాఖాలాలు లేవు. అలాంటిది ఒక ఒక కార్పోరేటర్‌ను మళ్ళీ పిలిచి పార్టీ కండువా కప్పడం వెనుక అసలు మర్మం ఏంటి అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా.. రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది.. మళ్ళీ తెరాస లోచేరిన రవీందర్ సింగ్ ఈ విషయం పై మాట్లాడుతూ ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని.. సిక్కుల హామీలను నెరవేస్తానని హామీ ఇవ్వడం తో మళ్ళీ తెరాస లో చేరడం జరిగిందని చెప్పుకొచ్చాడు.

  అయితే హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం నుండి సీఎం కేసిఆర్‌లో రాజకీయ పరమైన మార్పు స్పష్టంగా కనిపించింది. పార్టీ నాయకుల చేరికల్లో గతంలో ఎన్నడు పాల్గొన్న ధాఖలాలు చాలా తక్కువ అలాంటీ ఏ నేత పార్టీలో చేరిన చివరికి గ్రామంలో ఓ కార్యకర్తకు కూడా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత తన నుండి దూరంగా వెళ్లిన ఏ ఒక్కరిని కూడా పిలిచి దరి చేరనిచ్చింది లేదు.. అయితే ఆ అవకాశం రవీందర్ సింగ్‌కు దక్కిందని చెప్పవచ్చు.. అయితే దీని వెనక మరో రాజకీయ కోణం కూడా లేకపోలేదు...

  Adilabad : ఆ గ్రామంలో.. ఒకప్పుడు తుపాకుల మోత.. నేడు వేదమంత్రాల ఘోష.. కారణం ఏమిటి..?


  రవీందర్ సింగ్ పార్టీని వీడిన తర్వాత బీజేపీలో చేరతారనే ప్రచారం జరగడం ఓవైపు కొనసాగగా, మరోవైపు ఆయనకు ఎన్నికల్లో ఈటల రాజేందర్ బహిరంగంగానే మద్దతు పలికారు. అయితే బీజేపీలో జరిగిన అంతర్గత పరిణామాల నేపథ్యంలోనే బీజేపీలో ఎంట్రీకి బ్రేకులు పడ్డాయి.. దీంతో ఈ అవకాశాన్ని టీఆర్ఎస్ అధినేత అందిపుచ్చుకున్నారు. ఈటల వెంట వెళ్లిన వారికి రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించారు. ఇలా ఈటలకు బీజేపీలో పెద్దగా ప్రభావం లేదని చెప్పకనే చెప్పారు. ఇందుకోసమే ఒక కార్పోరేటర్‌ను ఆయనే స్వయంగా పిలిపించుకుని మాట్లాడడం ఇందులో భాగమనే చర్చ కొనసాగుతోంది.

  .

  మీ నగరం నుండి (కరీంనగర్)

  తెలంగాణ
  కరీంనగర్
  తెలంగాణ
  కరీంనగర్
  Published by:yveerash yveerash
  First published:

  Tags: CM KCR, Karimnagar, Trs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు