రాష్ట్రంలో మరోసారి కరోనా విజృంభిస్తుండడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్‌తో ధర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా బూస్టర్ డోస్‌పై దృష్టి సారించింది. దీంతో బూస్టర్ డోసుపై విధించిన సమయాన్ని కుదించాలని మంత్రి హారీష్ రావు కేంద్రానికి లేఖ రాశారు. ముఖ్యంగా బూస్టర్ డోసును రెండవ డోసు వేసుకున్న తర్వాత తొమ్మిది నెలలకు ఇస్తున్నారు. దీంతో ఆ సమయాన్ని 9 నెలల నుండి 6 నెలలకు తగ్గించాలని కోరారు. ఇక హెల్త్ కేర్ వర్కర్లకు మాత్రం మూడు నెలలకే తగ్గించాలని లేఖలో కోరారు. మరోవైపు 18 సంవత్సరాలు దాటిన వారందరికి ప్రికాషన్ డోసు ఇవ్వాలని విజ్ఝప్తి చేశారు.
కాగా రాష్ట్రంలో ఇటీవలే బూస్టర్ డోస్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. రెండో డోస్ వేసుకుని 9 నెలలు పూర్తయిన వారికే బూస్టర్ డోస్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్ అందించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం మేరకు గతంలో వ్యాక్సిన్ తీసుకున్న వారికి అదే రిజిస్ట్రేషన్‌తో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కొవిన్ యాప్ స్లాట్ బుకింగ్ ద్వారా నేరుగా టీకా కేంద్రానికి వెళ్లే వెసులుబాటు ఉందని ఆయన చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.