సిద్ధిపేటలో జాబ్ మేళా... సీరియస్‌గా తీసుకోవాలన్న హరీశ్ రావు

యువత ఉద్యోగం కోసం కష్టపడాలని... ప్రభుత్వ ఉద్యోగమా లేక ప్రైవేటు ఉద్యోగమా అనే విషయం ఆలోచించకుండా ఉద్యోగంలో చేరాలని హరీశ్ రావు సూచించారు.

news18-telugu
Updated: November 18, 2019, 2:42 PM IST
సిద్ధిపేటలో జాబ్ మేళా... సీరియస్‌గా తీసుకోవాలన్న హరీశ్ రావు
హరీశ్ రావు (ఫైల్)
  • Share this:
ఉద్యోగం విషయంలో యువతీయువకులు సీరియస్‌గా ఉండాలని మంత్రి హరీశ్ రావు యువతకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీవితంలో ఏదయినా సాధించాలంటే లక్ష్యం ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఉద్యోగం కోసం కష్టపడాలని... ప్రభుత్వ ఉద్యోగమా లేక ప్రైవేటు ఉద్యోగమా అనే విషయం ఆలోచించకుండా ఉద్యోగంలో చేరాలని హరీశ్ రావు సూచించారు. సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్‌లో పట్టణ పేదరిక నిర్ములన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు.

ఈ జాబ్ మేళాలో 30 కంపెనీలు పాల్గొన్నాయి. యువత సెల్‌ఫోన్‌కు బానిసలై జీవితాల్ని నాశనం చేసుకోవద్దని హరీశ్ రావు సూచించారు. జాబ్ మేళాలో ఉద్యోగం పొందలేకపోయిన వారికి సరైన శిక్షణ ఇప్పించి ఉద్యోగం అవకాశం కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పేర్లను రిజిష్టర్ చేసుకోవాలని సూచించారు. యువత కొద్దిగా కష్ట పడితే మంచి అవకాశాలు వస్తాయని హరీశ్ రావు అన్నారు. యువత తమకు ఇష్టమైన రంగంలో శిక్షణ పొందాలని, కష్టపడ్డవారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని అన్నారు.


First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>