Home /News /telangana /

HARISH RAO HAPPY ON SIDDIPET GOT TOP POSITION IN TELANGANA TENTH CLASS RESULTS PCV MDK

Siddipet : సిద్దిపేట దెబ్బ.. తెలంగాణ అబ్బా..! : హరీశ్ రావు

తల్లి తండ్రులకు తమ  పిల్లలు ఫస్ట్ క్లాస్ లో  పాస్  అయితే ఎంత ఆనందం పొందుతారో.. మన జిల్లా మొదటి స్థానంలో ఉంది అంటే తాను కూడా అంతే సంతోషపడ్డానన్నారు హరీశ్ రావు.

తల్లి తండ్రులకు తమ పిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఎంత ఆనందం పొందుతారో.. మన జిల్లా మొదటి స్థానంలో ఉంది అంటే తాను కూడా అంతే సంతోషపడ్డానన్నారు హరీశ్ రావు.

తల్లి తండ్రులకు తమ పిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఎంత ఆనందం పొందుతారో.. మన జిల్లా మొదటి స్థానంలో ఉంది అంటే తాను కూడా అంతే సంతోషపడ్డానన్నారు హరీశ్ రావు.

    Siddipet : 2022 తెలంగాణ టెన్త్ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా సత్తా చాటింది. అత్యధిక ఉత్తీర్ణత శాతంతో టాప్ లో నిలిచింది. దీంతో.. సిద్దిపేటలో అన్ని వర్గాలనుంచి హర్షం వ్యక్తం అవుతోంది. తాజాగా వచ్చిన టెన్త్ ఫలితాలతో సిద్ధిపేట జిల్లా విద్యారంగంలో కొత్త వెలుగు కనిపిస్తోంది.

    కొత్త జిల్లాల విభజన జరిగిన తర్వాత.. టెన్త్ ఫలితాలు చూసినప్పుడు.. సిద్దిపేట 13వ స్థానంలో ఉండేది. ఆ తర్వాత ఏనాడు వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా ర్యాంకింగ్ మెరుగుపరుచుకుంటూ ఇపుడు ఏకంగా టాపర్ గా నిలిచింది ఈ గడ్డ. ఓసారి 9 వ స్థానం.. ఆ తర్వాత 3 వ స్థానం.. 2 వ స్థానంలో నిలిచినప్పుడు.. ఈసారి ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ పొందాలని మంత్రి హరీశ్ రావు జిల్లా విద్యాశాఖ యంత్రాంగాన్ని మరింత అలర్ట్ చేశారు. ప్రత్యేక తరగతులు , తల్లిదండ్రులకు లేఖలు, సమీక్షలు నిర్వహించారు. అనుకున్నది సాధించి ప్రథమ స్థానం సాధించడం గొప్ప విషయమంటున్నారు విద్యావేత్తలు.



    విద్యారంగంలోనే కాదు.. దేశవ్యాప్తంగా పోల్చి చూసినా చాలా రంగాల్లో సిద్దిపేట మెరుగైన స్థితిలో ఉందని నివేదికలు చెబుతున్నాయి. పారిశుధ్యం, విద్యా బోధన లాంటి అంశాల్లో సిద్ధిపేటకు చెందిన వారికి జాతీయ స్థాయిలో అవార్డులు కూడా దక్కాయి. లేటెస్ట్ గా.. పది ఫలితాలతో ప్రథమంగా నిలవడంతో.. మిగిలిన జిల్లాలకు కూడా ఆదర్శంగా నిలిచినట్టైంది.

    సిద్దిపేట జిల్లా 10వ తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా సిద్దిపేట క్యాంపు ఆఫీస్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. మంత్రి హరీష్ రావు హాజరైన ఈ సమావేశంలో.. జిల్లా పాఠశాల విద్యా శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తల్లి తండ్రులకు తమ పిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఎంత ఆనందం పొందుతారో.. మన జిల్లా మొదటి స్థానంలో ఉంది అంటే తాను కూడా అంతే సంతోషపడ్డానన్నారు హరీశ్ రావు.

    గర్వకారణమైన ఈ విజయంలో అందరి కృషి ఉందన్నారు హరీశ్ రావు. సిద్దిపేట గౌరవం, ప్రతిష్ట మరింత పెరిగాయన్నారు. యావత్ తెలంగాణకే సిద్దిపేట వన్నె తెస్తోందన్నారు. విద్యార్థులు ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవడం వల్లే ఈ ఫలితం వచ్చిందన్నారు. 2022లో 97% తో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం అనేది ఓ రికార్డ్ గా నిలిచిపోతుందని.. 100 శాతం పాస్ పర్సెంటేజీతో తిరుగులేని రికార్డ్ ను సాధించాలని విద్యార్థులను కోరారు హరీశ్ రావు.

    సిద్దిపేట విద్యాక్షేత్రం కావాలి

    సిద్దిపేట జిల్లా సరస్వతి నిలయంగా, విద్యా క్షేత్రంగా, విజ్ఞాన జ్యోతిగా నిరంతరం వెలుగొందాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో రెండు వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాల , వెటర్నరీ , 4 పాలిటెక్నిక్ , మహిళ డిగ్రి , ఐటీఐ , అగ్రికల్చర్ పాలిటెక్నిక్ , ఉద్యాన , ఫారెస్ట్ కాలేజ్ లు ఉన్నాయి. వైద్య విద్యార్థులు 2వేల మంది సిద్దిపేటలో ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో పది ఫలితాల్లో మూడు మండలాలు మర్కుక్, అక్కన్నపేట, రాయ్ పోల్ మండలాలు 100 % ఉత్తీర్ణత సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మూడు మండాలాల ఎంఈఓలను మంత్రి సన్మానించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. విద్యార్థులతో, ఉపాధ్యాయులకు మిఠాయి తినిపించారు.
    Published by:V. Parameshawara Chary
    First published:

    Tags: Harish Rao, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు