హోమ్ /వార్తలు /తెలంగాణ /

Harish Rao in Dubbaka: ఓట్ల వరకే ఉత్తమ్.. ఆ తరువాత ఉండేది మేమే అన్న హరీశ్ రావు

Harish Rao in Dubbaka: ఓట్ల వరకే ఉత్తమ్.. ఆ తరువాత ఉండేది మేమే అన్న హరీశ్ రావు

హరీశ్ రావు

హరీశ్ రావు

Harish Rao: కాంగ్రెస్ తరపున డుబ్బాక టికెట్ ఆశించిన నర్సింహారెడ్డితో పాటు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మనోహర్ రావు... హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.

  దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్ రావు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దుబ్బాకలో ఓట్లు వేసే వరకే మాత్రమే ఉత్తమ్ ఇక్కడ ఉంటాడని ఆయన కామెంట్ చేశారు. ఎన్నికలు అయిపోయినా ప్రజల మధ్యలో ఉండేది మేమే అని అన్నారు. ఓట్లు కోసం వచ్చేవాళ్లకు ఓట్లు వేయాలా ? లేక ఇక్కడే ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే వారి ఓటు వేయాలో ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. హరీశ్ రావు ఎలా పని చేస్తాడో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి ప్రజలను అడిగి తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు రావేమో అని కాంగ్రెస్ ఫస్ట్రేషన్‌లో ఉందని హరీశ్ రావు విమర్శించారు.

  భర్త కోల్పోయిన మహిళను అసమర్థురాలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా అంటారని ప్రశ్నించారు. యావత్ దుబ్బాక మహిళా లోకాన్ని ఉత్తమ్ కించపరిచారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. తొలి సారి దుబ్బాకకు మహిళా ఎమ్మెల్యే కాబోతుందని మహిళలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇక కాంగ్రెస్ తరపున డుబ్బాక టికెట్ ఆశించిన నర్సింహారెడ్డితో పాటు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మనోహర్ రావు... హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా దుబ్బాకలో టీఆర్ఎస్‌ ఘన విజయానికి నాయకులంతా కృషి చేయాలని హరీశ్ రావు కోరారు.

  ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. అధికార టీఆర్ఎస్ తరపున రామలింగ రెడ్డి సతీమణి సుజాత బరిలో ఉండగా.. కాంగ్రెస్ తరపున చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు. బీజేపీ తరపున రఘునందన్ రావు పోటీ చేస్తుండగా.. టీడీపీ తరపున ఇల్లెందుల రమేష్ బరిలో నిలిచారు. సీపీఐ, సీపీఎం పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయనే అంశం తెలియాల్సి ఉంది. దుబ్బాక నియోజక వర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యాంకర్ కత్తి కార్తీక.. గత 15 రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. మరికొందరు అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగొచ్చని తెలుస్తోంది. 2018 సార్వత్రిక ఎన్నికలలో 14 మంది బరిలో ఉండగా.. జరగబోయే ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సిద్ధిపేట, గజ్వేల్ తరహాలో అధికార పార్టీ దుబ్బాకను అభివృద్ధి చేయలేదనే వాదనను ఇండిపెండెంట్లు ఎక్కువగా తెరపైకి తీసుకొస్తున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Harish Rao, Telangana

  ఉత్తమ కథలు